YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

క్వారీ అక్రమాలపై ఏపీ సర్కార్ ఫోకస్

క్వారీ అక్రమాలపై ఏపీ సర్కార్ ఫోకస్

క్వారీ అక్రమాలపై ఏపీ సర్కార్ ఫోకస్
అమరావతి
రాష్ట్రంలో  మైనింగ్ అక్రమాలపై ఏపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుడానికి సిద్దమయింది.  సహజ వనరుల దోపిడీపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ముందుగా విశాఖలో క్వారీలపై తనిఖీల కోసం స్పెషల్ డ్రైవ్ చేపట్టింది.  డ్రోన్లు, జీపీఎస్ ఆధారిత సర్వే ద్వారా అక్రమాల గుర్తించడానికి నడుం బిగించింది.  ఇష్టారాజ్యంగా జరుగుతున్న గనుల తవ్వకాలకు ఇకపై  చెక్ పెట్టనున్నారు. అనకాపల్లిలోని ఓ మైనింగ్ కంపెనీ కార్యకలాపాలపై విచారణకు రంగం సిద్దయింది. ఈ కంపేనిపై సీఐడీ, గనులశాఖ విజిలెన్స్ కూడా ఇప్పటికే భారీగా జరిమానాలు విధించింది. విశాఖలోని వందల క్వారీలున్నాయి. వాటిలో చాల వాటికి  కనీస నిబంధనలు కూడా పాటించడం లేదని నిర్ధారించారు. విజిలెన్స్, మైన్స్, సర్వే శాఖ, కాలుష్య నియంత్రణ మండలి టీమ్లతో సోదాలు చేయనున్నారు.  ఏజెన్సీతో పాటు అనకాపల్లి చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. వివాదాస్పదంగా మారిన లేటరైట్, గ్రానైట్ గనుల అక్రమాల లెక్కలు తీస్తున్నారు.

Related Posts