జీజీహెచ్ లో శిశువుల తారుమారు కలకలం
కర్నూలు
కర్నూలు జీజీహెచ్ లో శిశువుల తారుమారు కలకలం రేపింది. దేవనకొండ మండలం నెల్లిబండకు చెందిన రజియా అనే మహిళ మగబిడ్డకు జన్మనిచ్చింది. శిశువుకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఎన్ ఐ సియూలో చికిత్స అందిస్తున్నారు. రాత్రి ఎనిమిది గంటలకు శిశువు చనిపోయాడని ఆమెకు ఆసుపత్రి సిబ్బంది వెల్లడించారు. అయితే, పుట్టినప్పటి బిడ్డ, మృత శిశువు వేరు వేరుగా ఉన్నారని, తన బిడ్డను తారుమారు చేశారని రజియా ఆరోపించింది. బాలింత బంధువులు రాత్రి ఆసుపత్రిలో ఆందోళన కు దిగారు. ఆసుపత్రి అధికారులు విచారణ చేస్తున్నారు.