గుప్త నిధుల కోసం తవ్వకాలు
నిర్మల్
నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని కోర్బ గల్లిలో ఓ కుటుంబం గుప్త నిధుల కోసం తవ్వకాలు చేస్తున్నట్లు బహిరంగంగా చర్చించుకుంటున్నారు. బుధవారం నాడు ఆ ఇంటిలో కొందరు పూజారులు గుప్తా నిధుల పూజలు చేసి నట్లు స్థానికులు చెబుతున్నారు. ఇటీవల ఆ ఇంట్లో గుప్తా నిధుల కోసం కుక్క పిల్ల ను బలి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇందుకు మహారాష్ట్ర కు చెందిన ఇద్దరు తాంత్రికులు పూజలు చేసిస్తుండగా స్థానికులు అడ్డుకున్నారు. దింతో సదరు తాంత్రికులు పూజలు వదిలేసి పరారయ్యారు. కానీ ఆ ఇంట్లో కొన్ని సంవత్సరాల క్రితం కుటుంబ సభ్యుల్లో ఒకరు ఆత్మహత్య చేసుకున్నారని అందుకే శాంతి, వాస్తు పూజలు చేశామని పోలీసులకి ఇంటి యజమాని చెప్పినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఇంటిలో తవ్వకాలు జరపడం పూజలు చేయడంతో స్థానికులు భయాందోళనకు గురౌతున్నారు.