YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

లండన్ లో నిరాడంబరంగా "టాక్ లండన్ బోనాల జాతర"

లండన్ లో నిరాడంబరంగా "టాక్ లండన్ బోనాల జాతర"

లండన్ లో నిరాడంబరంగా "టాక్ లండన్ బోనాల జాతర"
 లండన్ జూలై 13
తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ ( టాక్) ఆధ్వర్యం లో ప్రతీ సంవత్సరం మాదిరిగా ఘనంగా బోనాల జాతరనునిర్వహించారు.లండన్ వీధుల్లో తొట్టెల ఊరేగింపుతో తెలంగాణా  సంస్కృతి సంప్రదాయాలని ప్రపంచానికి చాటిచెప్పేలా వైభవంగా నిర్వహించారు. బోనాల సందర్భంగా అమ్మవారికి బోనాలు సమర్పించి ప్రజలంతా ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని కోరుకున్నామని, నేడు కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న విషయం మనందరికీ తెలుసునని , టాక్ కార్యవర్గ సభ్యులు కోవిడ్ నిబంధనలను పాటిస్తూ స్థానిక గుడి లో అమ్మవారికి బోనాలను సమర్పించి అందరినీ చల్లగా చూడాలని, కరోనా నుండి ప్రజలని రక్షించాలని కోరుకున్నామని అధ్యక్షులు రత్నాకర్ కడుదుల  ఉపాధ్యక్షురాలు శుష్మణ రెడ్డి తెలిపారు.ఈ కార్యక్రమం లో పాల్గొని బోనాలు సమర్పించిన ప్రతి టాక్ సంస్థ ఆడబిడ్డలందరికి శుష్మణ రెడ్డి కృతఙ్ఞతలు తెలిపారు.చిన్న పిల్లలు టాక్ జెండాలతో , అమ్మవారి నినాదాలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.చివరిగా టాక్ సభ్యులంతా ప్రజలు స్వీయ నియంత్రణ తో పాటు ప్రభుత్వ నిబంధనలు పాటించాలని కోరారు, అలాగే అమ్మవారు ప్రజలందరినీ రక్షించాలని ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల, ఉపాధ్యక్షురాలు శుష్మునా రెడ్డి,
మల్లారెడ్డి,నవీన్ రెడ్డి,వెంకట్ రెడ్డి,స్వాతి , సుప్రజ,సురేష్ బుడగం, రాకేష్ పటేల్, సత్యపాల్ ,హరిగౌడ్ ,గణేష్, రవి రెటినేని,  , రవి పులుసు,మాధవ్ రెడ్డి ,వంశీ వందన్ , భూషణ్, అవినాష్,వంశీ కృష్ణ ,పృథ్వి ,శ్రీ లక్ష్మి, విజిత,క్రాంతి , భరత్ ,వంశీ పొన్నం , చింటూ ,రమ్య , స్వప్న,లాస్య, పూజిత ,బిందు ,మాధవి తదితరులు పాల్గొన్న వారిలో ఉన్నారు.

Related Posts