YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

నిండు ప్రాణాన్ని కాపాడిన హైవే పెట్రోలింగ్ సిబ్బంది

నిండు ప్రాణాన్ని కాపాడిన హైవే పెట్రోలింగ్ సిబ్బంది

నిండు ప్రాణాన్ని కాపాడిన హైవే పెట్రోలింగ్ సిబ్బంది
మానవత్వాన్ని మరోమారు చాటుకున్న ఆలమూరు పోలీసులు.
రావులపాలెం
గౌతమి గోదావరిలో మునిగిపోతున్న ఓ నిండు ప్రాణాన్ని ప్రాణాలకు తెగించి భారీ వర్షంలోనూ కాపాడి మరోమారు తమ మానవత్వాన్ని చాటుకున్నారు ఆలమూరు పోలీసులు. వివరాల్లోకి వెళితే రంగంపేటకు చెందిన కోటిపల్లి నవీన్ ద్విచక్రవాహనంపై రావులపాలెం వైపు నుండి జొన్నాడ వైపు గౌతమి పాత బ్రిడ్జిపై వస్తూ తన ద్విచక్ర వాహనాన్ని ఆపి అకస్మాత్తుగా బ్రిడ్జిపై నుండి గోదావరిలో దూకగా అటువైపు గస్తీ తిరుగుతున్న ఆలమూరు ఎస్సై ఎస్.శివప్రసాద్ తో పాటు హైవే పోలీస్ పెట్రోలింగ్ పైలెట్ జీ.వీ.వీ.ఎస్.మూర్తి, హెచ్ సీ ఆర్ఎస్వి రాజులు సంఘటనను గుర్తించి హుటాహుటిన గోదావరి గట్టుకు చేరుకొని భారీగా కురుస్తున్న వర్షంలో నావపై వెళ్లి ప్రాణాలకు తెగించి గోదావరి మధ్యలో మునిగిపోతున్న నవీన్ ను కాపాడగలిగారు. అయితే పాత కొత్త బ్రిడ్జిపై వెళ్తున్న ప్రయాణీకులు జరుగుతున్న సంఘటనను ఉత్కంఠగా పరిశీలించారు. కాగా నవీన్ విశాఖ డైరీ లో పని చేస్తున్నట్లు తెలియవచ్చింది. పోలీసుల్లో మానవత్వము ఉందంటూ పలువురు  పోలీసులను కొనియాడారు. కాగా నవీన్ గోదావరిలోకి దూకడానికి గల కారణాలను దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శివప్రసాద్ తెలిపారు.

Related Posts