నాయి బ్రాహ్మణులకు సముచిత స్థానం
మంత్రి చెల్లుబోయిన
తాడేపల్లి
తాడేపల్లి వైసిపి కేంద్ర కార్యలయంలో రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ సమావేశంలో బిసి సంక్షేమ శాఖమంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, ప్రభుత్వ సలహాదారులు సజ్జాల రామకృష్ణ రెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి తదితరులు పాల్గోన్నారు. మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉండే బిసిల 139 కులాల సమతుల్యత పాటించే ఏకైక పార్టీ వైసిపి. ప్రతి కులాల కష్టనష్టాలను పాదయాత్రలో స్వయంగా వైఎస్. జగన్మోహన్ రెడ్డి తెలుసుకొని పాలనలో అమలు చేస్తున్నారని అన్నారు.
ప్రతి బలహీనవర్గాన్నికి ఆస్తులు ఉండవు...వృత్తులు ఉంటాయి. ఆ వృత్తులను ప్రోత్సహించి సంరక్షించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంది. కొన్ని పత్రికలు చేసే ప్రభుత్వంపై పని కట్టుకొని ఆసత్యలను ప్రచారం చేసే పనిలోనే ఉన్నాయి. ప్రతి బలహీన వర్గానికి చెందిన వ్యక్తికి ఇంత మొత్తంలో సంక్షేమ కార్యక్రమాలు అందచేస్తున్న ప్రభుత్వ పనితీరున ఆ పత్రికలు జీర్ణించుకోలేకపోతున్నాయి. ఈలాంటి దుష్పచారాలను మన బలహీనవర్గాలు అందరూ కలిసి తిప్పి కొట్టాలి. ఆనాడు దుర్గ గుడి నాయి బ్రాహ్మణుల తోకలు కత్తిరిస్తాను అని చంద్రబాబు దుర్బాషలాడారు. అదే నాయి బ్రాహ్మణ మహిళను దుర్గ గుడిలో డైరక్టర్ చేసి వారి ఆత్మగౌరవం నిలిపిన నాయకుడు మన ముఖ్యమంత్రని అన్నారు.
బలహీన వర్గాల ఆత్మగౌరవం నిలిపే దిశగా పాలన కొనసాగిస్తున్న ముఖ్యమంత్రికి ఓ బలహీనవర్గానికి చెందిన వ్యక్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అబద్దాలు పెట్టుబడి పెట్టి చంద్రబాబులా కాలయాపన చేసే ప్రభుత్వంలో కాదు మనం ఉండేది. మన ముఖ్యమంత్రి పాదయాత్రలో 139 కులాల కోసం ఏవైతే హామీలు ఇచ్చారో వాటిని అమలు చేసే దిశగా పాలన కొనసాగిస్తున్నారు. ఓట్లు కోసం కాదు మన ముఖ్యమంత్రి ఆలోచించేది. మన భావితారాల భవిష్యత్తు గురించి మన ముఖ్యమంత్రి ఆలోచించేదని అన్నారు.