నివాసయోగ్యమైన స్థలాలను ఎంపిక చేసుకుని ప్రభుత్వమే ఇళ్లను నిర్మించివ్వాలి ...
టీడీపీమాట మార్చిన రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందులకు గురవుతున్న లబ్ధిదారులు
తుగ్గలి
నివాసయోగ్యమైన స్థలాలను మాత్రమే ప్రభుత్వం ఎంపిక చేసి,లబ్ధిదారులకు ప్రభుత్వమే ఇళ్లను నిర్మించి ఇవ్వాలని తుగ్గలి మండల తెలుగుదేశం పార్టీ నాయకులు డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా టిడిపి నాయకులు మాట్లాడుతూ తుగ్గలి మండలంలోని 23 పంచాయతీలలో నివాసయోగ్యమైన స్థలాలలో స్వయంగా ప్రభుత్వమే ఇల్లులు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చి,ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులే ఇళ్లను కట్టుకోవాలని చెప్పడం చాలా విడ్డూరంగా ఉందని టిడిపి నాయకులు తెలియజేశారు.ప్రభుత్వం రోజుకొక మాట చెప్పి లబ్ధిదారులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందని వారు తెలియజేశారు.దీనితో పాటుగా విడతల వారిగా బిల్లులను ఇస్తామనడం చాల దారుణమని,ఇల్లు పేదవారు నిర్మించుకోవడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు తెలియజేశారు. ప్రస్తుతం కరోనాతో రైతులకు,కూలీలకు,భవన కార్మికులకు,చిరు వ్యాపారులకు పనులు లేక జీవిచడానికే కష్టంగా ఉంటే,ఇల్లు నిర్మిచుకోవడం ఎలా సాధ్యం అవుతుందని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.కావున ఇళ్లను ప్రభుత్వమే నిర్మించి ఇవ్వాలని కోరుతూ, అదేవిధంగా మండల వ్యాపంగా అనేక గ్రామ పంచాయతిలలో ప్రజలు నివసించడానికి పనికిరాని స్థలాలను ప్రభుత్య అధికారులు ఎంపిక చేసారని వాటిలో శ్మసానాలను, వాగులను,వంకలను,కొండల వంటి స్థలాలను ఎంపిక చేశారని,ఇప్పటికైనా అధికారులు నివాసయోగ్య స్థలాలను ఎంపిక చేసి ప్రభుత్యమే ఇళ్లను నిర్మించి లబ్ధిదారులకు అందజేయాలని వారు తుగ్గలి తహసిల్దార్ కార్యాలయం నందు మంగళవారం రోజున రెవెన్యూ ఇన్స్పెక్టర్ సుధాకర్ రెడ్డి కు వినతి పత్రాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో తుగ్గలి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తిరుపాల్ నాయుడు,ఉపాధ్యక్షుడు రాంపురం వెంకట రాముడు,తెలుగు యువత మండల అధ్యక్షులు గిరిగెట్ల సత్యప్రకాష్,చెన్నంపల్లి లక్ష్మీ నారాయణ తదితర టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.