YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి తెలంగాణ

50 వేల ఉద్యోగాలకు ఓకే

50 వేల ఉద్యోగాలకు ఓకే

50 వేల ఉద్యోగాలకు ఓకే
హైదరాబాద్, జూలై 13,
ప్రగ‌తి భ‌వ‌న్‌లో ముఖ్య‌మంత్రి కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న రాష్ర్ట మంత్రివ‌ర్గం ముగిసింది. ఈ స‌మావేశానికి మంత్రులంద‌రూ హాజ‌ర‌య్యారు. ఉద్యోగ నియామకాలు, కృష్ణా జల వివాదాల అంశాల‌తో పాటు ప‌లు కీల‌క అంశాల‌పై చ‌ర్చిస్తున్నారు. వీలైనంత త్వరలో 50వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇప్పటికే ప్రకటించారు.ముఖ్యంగా సీమ ఎత్తిపోతలను అడ్డుకొనేందుకు ఎలాంటి పద్ధతులు అనుసరించాలన్న దానిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది. కరోనా కారణంగా పడిపోయిన ఆదాయాన్ని పెంచుకునే మార్గాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులోభాగంగా భూముల విలువను సవరించాలనే ఆలోచనకు వచ్చింది. దీనిపై ఏర్పాటుచేసిన క్యాబినెట్‌ సబ్‌కమిటీ చేసిన ప్రతిపాదనలపై చర్చించి ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోనున్నారు. ఒకవేళ కరోనా థర్డ్‌వేవ్‌ వస్తే ఎదుర్కోవడానికి సంసిద్ధతపై చర్చించనున్నది. వానకాలం సీజన్‌ ప్రారంభమైన నేపథ్యంలో విత్తనాలు, ఎరువులు ఎంతమేరకు సిద్ధంగా ఉన్నాయి, కల్తీ విత్తనాల నిరోధానికి తీసుకుంటున్న చర్యలపై చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటారు. జూలై 1నుంచి 10వ తేదీ వరకు జరిగిన పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలపై సమీక్షిస్తారు.వీధి దీపాల కొరకు అన్ని గ్రామాల్లో మూడో వైర్‌ ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. అదే విధంగా నెల రోజులలోగా వైకుంఠధామాల నిర్మాణాలు పూర్తి చేయాలని సూచించారు. మంగళవారం తెలంగాణ కేబినెట్‌ సమావేశంలో భాగంగా పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి పురోగతిపై చర్చించిన కేసీఆర్‌.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హైదరాబాద్‌ నగర శివారులోని మున్సిపాలిటీల్లో మంచినీటి సమస్య నివారణ కోసం అదనంగా రూ.1200 కోట్లు మంజూరు చేశారు.నీటి ఎద్దడి నివారణకు తక్షణమే చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మున్సిపాలిటీల అభివృద్ధి కోసం ల్యాండ్‌ పూలింగ్‌ వ్యవస్థ ద్వారా ప్రత్యేకంగా లేఅవుట్లను అభివృద్ధి చేయాలన్నారు. పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ శాఖలు అధికారులు కేబినెట్‌కు పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి పురోగతికి సంబంధించిన పలు నివేదికలు కేబినెట్‌కు సమర్పించారు.

Related Posts