కేంద్ర ప్రభుత్వ అసమర్ధ విధానాలతోనే దేశంలోధరల పెరుగుదల
కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి పీ.చిదంబరం
న్యూఢిల్లీ జూలై 13
కేంద్ర ప్రభుత్వ అసమర్ధ విధానాలతోనే దేశంలో ధరలు మండిపోతున్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి పీ చిదంబరం ఆరోపించారు. మంగళవారం ఎక్కడ మీడియా సమావేశం లో మాట్లాడుతూ ద్రవ్యోల్బణం ఎగబాకుతోందని ఆర్ధిక వ్యవస్థ నిర్వహణలో మోదీ సర్కార్ లోపభూయిష్టంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వ తప్పుడు విధానాలు, ఆర్ధిక వ్యవస్థ నిర్వహణలో చేతకానితనం వల్లే ధరలు మండుతున్నాయని వ్యాఖ్యానించారు.ఇంధన ధరలు, ఇతర వస్తువుల ధరలు చుక్కలు చూస్తున్నా కేంద్ర ప్రభుత్వం చోద్యం చూస్తోందని ఆరోపించారు. పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ ధరలను తక్షణమే తగ్గించాలని, వీటిపై దిగుమతి సుంకాలను సమీక్షించాలని చిదంబరం డిమాండ్ చేశారు. ద్రవ్యోల్బణానికి ప్రధాని నరేంద్ర మోదీయే నేరుగా బాధ్యత వహించాలని అన్నారు. ధరల పెరుగుదలపై కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణిని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని అన్నారు.