YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

జగన్ తో నీతులు చెప్పించుకోవాల్సిన అవసరం మాకు లేదు బందరుపోర్టును సంక్రాంతి కంటే ముందే పూర్తిచేస్తాం మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు

జగన్ తో నీతులు చెప్పించుకోవాల్సిన అవసరం మాకు లేదు బందరుపోర్టును సంక్రాంతి కంటే ముందే పూర్తిచేస్తాం  మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు

మచిలీపట్నం పోర్టు విషయంలో నిన్న జగన్ మాట్లాడిన మాటలు ప్రజలను తప్పుదోవ పట్టించేవిధంగా ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారంనాడు జలవనరుల శాఖ విడిది కార్యాలయంలో మంత్రులు దేవినేని ఉమా, కొల్లు రవీంద్రలు మీడియా సమావేశంలో మాట్లాడుతూ, వైఎస్ హయాంలో మచిలిపట్నం పోర్టు విషయంలో జరిగిన కుట్ర గురించి దాచిపెట్టి నేడు జగన్ కల్లబొల్లి కబుర్లు చెబుతున్నాడన్నారు. 100 కోట్లకు మచిలీపట్నం పోర్టును అమ్మేసిన చరిత్ర వైయస్ రాజశేఖర్ రెడ్డిదని, బందరు పోర్టును 100 కోట్ల ముడుపుల కోసం ఆశపడి గిలకలదిండి నుండి గోగిలేరుకి వైఎస్ తరలిస్తే ఎన్నో పోరాటాలు చేసి, నిరాహారదీక్షలు చేసి తిరిగి తెచ్చుకున్నామని ఈ సందర్భంగా గుర్తు చేసారు. బందరు పోర్టు విషయంలో నువ్వు, నీ తండ్రి, నీ తండ్రి ఆత్మ కలిసి చేసిన కుట్రలు ఇక్కడి ప్రజలు మరిచిపోయారనుకోవద్దు అంటూ జగన్ ను ఉద్దేశించి మంత్రి ఉమ వ్యాఖ్యానించారు. వైఎస్ హయాంలో  మచిలీపట్నం పోర్టును తరలించిన విషయం వాస్తవమా కాదా? ఢిల్లీలో ఉన్న వైఎస్ ఆత్మ సమాధానం చెప్పాలి అని మంత్రి డిమాండ్ చేశారు. బందరు పోర్టు పై కార్యాచరణ ప్రాణాళికతోనే ముందుకెళ్తున్నామని, వచ్చే సంక్రాంతికి బందరుకి షిప్పు తీసుకువస్తామని మంత్రి చెప్పారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించమని మేము బహిరంగంగా పిలుపు ఇచ్చామని, జగన్ కు దమ్ము, ధైర్యం ఉంటే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించమని పిలుపునివ్వాలని మంత్రి  దేవినేని ఉమా ఛాలెంజ్ చేశారు. A2 విజయసాయి రెడ్డిని బెంగళూరు పంపి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో  గాలి జనార్ధన రెడ్డికి మద్దతుగా బీజేపీ విజయం కోసం రహస్యంగా ప్రచారం చేయిస్తున్న విషయం వాస్తవం కాదా అని మంత్రి ప్రశ్నించారు. మీ కుమ్ముక్కుకు ఇదే నిదర్శనమని అన్నారు. మోడీకి వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడలేని జగన్, ఆ పార్టీ నాయకులు దొంగ యాత్రలు, దొంగ దీక్షలు చేస్తున్నారు. మా పోరాటం మోడీపై, మరి మీ పోరాటం ఎవరిపై? మోడీపైనా లేక చంద్రబాబుపైనా? సమాధానం చెప్పాలి అంటూ మంత్రి ఉమా జగన్ పై నిప్పులు చెరిగారు. నాడు పట్టిసీమ దండగన్న నేడు జగన్  కృష్ణా జిల్లా దాటేలోపు పట్టిసీమపై మాట్లాడాలని మంత్రి డిమాండ్ చేశారు. ఈ ఒక్క సంవత్సరంలోనే పట్టిసీమ నీళ్లను ఉపయోగించి కృష్ణ డెల్టాలో 13 లక్షల ఎకరాల్లో 10వేల కోట్ల విలువైన ఆక్వా, వరి ఇతర పంటలను కాపాడామని కావాలంటే రైతులను అడిగి జగన్ తెలుసుకుని మాట్లాడాలని మంత్రి అన్నారు. సత్యం రామలింగరాజు కుటుంబాన్ని  వేధించి వారి ఆస్తులను దోచుకున్న నీ దుర్మాగ్రపు  చరిత్ర మాకు తెలుసునని మంత్రి వ్యాఖ్యానించారు. పోలవరంతోపాటు తోటపల్లి, పురుషోత్తపట్నం, గాలేరు నగరి, చింతలపూడి, హంద్రీనీవా వంటి ప్రాజెక్టుల్లో పురోగతిని చూడలేక కళ్ళుండీ గుడ్డివాడిలా వ్యవహరిస్తున్న జగన్ కనీసం ఒకరోజు ముందుగా లోటస్ పాండ్ కి వెళ్లి రహస్య మంతనాలు చేసే బదులు కడప, పులివెందుల ప్రాంతాల్లో పర్యటించి దాదాపు 11 టీఎంసీల నీటిని కడప జిల్లాకు తరలించి అక్కడి పంటలను కాపాడి, 40ఏళ్లుగా నీకుటుంబం చేయలేని పనిని చేసి చూపించిన విషయాన్ని గమనించాలని మంత్రి ఎద్దేవా చేశారు. ఆఖరికి నీరు చెట్టు కింద పనులు చేసి బిల్లులకోసం ఎదురుచూస్తున్న చిన్న సన్నకారు రైతులపై కూడా పడి ఏడుస్తూ సాక్షి పత్రిక, ఛానెల్ లో తప్పుడు రాస్తున్నారని మంత్రి అన్నారు. మా ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ములేక జగన్ మహిళా నాయకులతో తిట్టిస్తున్నాడని మంత్రి ఎద్దేవా చేశారు. ప్రతి ఒక్క అభివృద్ధి పనులు, ప్రాజెక్టులపై దుష్ప్రచారం చేస్తున్న  నయవంచకుడైన జగన్ మాటలను ప్రజలు విశ్వసించరు అని మంత్రి ఉమ వ్యాఖ్యానించారు.

Related Posts