YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

ఎలక్ట్రిక్ వాహనాల వినియోగంతో వాయు, శబ్ధ కాలుష్యానికి చెక్  3 సీటర్ ప్యాసింజర్ ఎలక్ట్రికల్ ఆటోను ప్రారంభించిన రవాణా శాఖ మంత్రి పువ్వాడ

ఎలక్ట్రిక్ వాహనాల వినియోగంతో వాయు, శబ్ధ కాలుష్యానికి చెక్  3 సీటర్ ప్యాసింజర్ ఎలక్ట్రికల్ ఆటోను ప్రారంభించిన రవాణా శాఖ మంత్రి పువ్వాడ

ఎలక్ట్రిక్ వాహనాల వినియోగంతో వాయు, శబ్ధ కాలుష్యానికి చెక్
 3 సీటర్ ప్యాసింజర్ ఎలక్ట్రికల్ ఆటోను ప్రారంభించిన రవాణా శాఖ మంత్రి పువ్వాడ
హైదరాబాద్
వాహనాల వల్ల ఉత్పత్తి అవుతున్న వాయు , శబ్ద కాలుష్యాన్ని తగ్గించేందుకు ఎలక్ట్రికల్ వెహికల్స్ కొంత దోహదపడగలవని , ఈ రంగానికి ప్రభుత్వం తగిన ప్రోత్సహకాలు ఇస్తోందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమర్ అన్నారు .ఫీజియో వెహికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ తయారు చేసిన 3 సీటర్ ఎలక్ట్రికల్ ప్యాసింజర్ ఆటో , ట్రాలీ ఆటోలను మంగళవారం ఖైరతాబాద్ లోని రవాణా శాఖ కార్యాలయం ప్రాంగణంలో కమిషనర్ ఎం.ఆర్.ఎం.రావు గారితో కలిసి లాంఛనంగా ప్రారంభించారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ , నగరంలో వాహనాల వినియోగం రోజు రోజుకు పెరుగుతుండటంతో కాలుష్యం అధికమవవవుతోందని , పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రభుత్వం ఈ మేరకు ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తోందన్నారు . ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి మోటర్ , ఆటో , ట్రాలీ వాహనాలతో పాటు మాక్సీ , ఎలక్ట్రికల్ బస్సుల కొనుగోళ్లను పెంచేందుకు ప్రభుత్వం రాయితీలు కల్పిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు . ఈ వాహనాల వినియోగం ద్వారా వాయు , శబ్ద కాలుష్యం తగ్గుతుందని , ఇందుకోసం ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ఫీజు , క్వాటర్లీ ట్యాక్స్ లో మినహాయింపు ఇస్తోందని తెలిపారు . పస్ట్ కమ్ పస్ట్ సర్వీస్ కింద మొదటి 5 వేల వరకు 9 విల్లర్ వెహికలకు రాయితీలు కల్పిస్తున్నామని , తద్వారా రవాణా శాఖకు రూ .264 కోట్ల మేర భారం పడినప్పటికీ ప్రభుత్వం ఆ భారాన్ని భరించి ఆ రంగాన్ని ప్రోత్సహిస్తోందన్నారు . ఐటి , పురపాలక శాఖ మంత్రి తారక రామారావు చేతుల మీదుగా ప్రారంభించిన ఎలక్ట్రికల్ వెహికల్స్ ( ఈవీ ) పాలనీకి అనుగుణంగా కాలుష్యాన్ని నియంత్రించే దిశలో తగిన చర్యలు తీసుకోవడం జరుగుతోందన్నారు . హైదరాబాద్ వంటి మహానగరంలో ఆటోలకు పెద్ద ఎత్తున డిమాండ్ ఉందని , ఈ మేరకు ఎలక్ట్రికల్ వాహనాల రిజిస్ట్రేషన్స్ ప్రక్రియ కూడా ప్రారంభమైందన్నారు .ఇప్పటి వరకు 300 కు పైగా ట్రాలీ ఆటోలు , 26 ప్యాసింజర్ ఆటోల రిజిస్ట్రేషన్స్ పూర్తయ్యాయని తెలిపారు . ఇంట్లో ఛార్జింగ్ పెట్టుకుని నడవడం ద్వారా 110 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని పాత్రికేయులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు . కమర్షియల్ ఛార్జింగ్ పాయింట్సను ఆయా కంపెనీలు కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు వెల్లడించారు . సరదాగా స్టీరింగ్ పట్టి ఆటోను నడిపి ఆశ్చర్యానికి గురి చేసిన మంత్రి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఎలక్ట్రికల్ ప్యాసింజర్ ఆటోలో డ్రైవర్ సీట్లో కూర్చోని సరదాగా స్టీరింగ్ వట్టి నడపడంతో అక్కడ ఉన్న వారందరూ ఆశ్చర్యంతో ఆ దృశ్యాన్ని తిలకించారు . ఈ ఆటోలో రవాణా శాఖ కమిషనర్ ఎం.ఆర్.ఎం.రావుతో పాటు బీజియో కంపెనీ ప్రతినిధి కూడా ప్రయాణించారు 

Related Posts