YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు దేశీయం

చొక్సీకి బెయిల్

చొక్సీకి బెయిల్

చొక్సీకి బెయిల్
న్యూఢిల్లీ, జూలై 13,
వజ్రాల వ్యాపారి, పంజాబ్ నేషనల్ బ్యాంకు (PNB) కుంభకోణం కేసులో నిందితుడు మెహుల్ చోక్సీకి డొమినికా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. చోక్సీ ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. అంటిగ్వా నుంచి క్యూబాకు పారిపోతూ డొమినికా బీచ్‌లో పట్టుబడ్డ మెహుల్ చోక్సీ.. మే 23 నుంచి డొమినికా జైల్లో ఉన్న విషయం తెలిసిందే. తాజాగా, బెయిల్ లభించడంతో డొమినికా నుంచి అంటిగ్వా అండ్ బార్బుడాకు చోక్సీ వెళ్లనున్నారు. అంటిగ్వా పౌరసత్వం ఉన్న చోక్సీ.. మే నెలలో అదృశ్యమయ్యారు.పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం బయటపడటానికి కొద్ది రోజుల ముందే 2018 జనవరిలో దేశం నుంచి పారిపోయిన చోక్సీ.. అంట్విగ్వాలోనే ఉంటున్నారు. నరాల సంబంధిత సమస్యలతో బాధపడుతున్న చోక్సీ.. అంటిగ్వాలోని వైద్య నిపుణుడిని సంప్రదించడానికి అనుమతించాలని డొమినికా హైకోర్టును కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన న్యాయస్థానం.. ఇందుకు అంగీకారం తెలిపింది. మెహుల్ చోక్సీ తరఫున డొమినికా కోర్టులో వాదనలు వినిపించిన ప్రముఖ లాయర్ విజయ్‌ అగర్వాల్ ఈ మేరకు మీడియాకు తెలియజేశారుతనకు నచ్చిన వైద్యుడి వద్ద చికిత్స తీసుకునే హక్కులు, చట్టనియమాలను డొమినికా హైకోర్టు చివరిగా సమర్ధించింది’ అని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా, భారత ప్రభుత్వ ప్రతినిధులు తన అరెస్ట్‌ను నియంత్రించారని ఆరోపిస్తూ డొమినికా హైకోర్టులో చోక్సీ పిటిషన్ దాఖలు చేశారు. తనకు వ్యతిరేకంగా చేసిన ఆరోపణలను కొట్టివేయాలని చోక్సీ కోరినట్టు స్థానిక మీడియా తెలిపింది. మెహుల్ చోక్సీ దేశంలోకి అక్రమంగా ప్రవేశించారని డొమినికా పోలీసులు కేసు నమోదుచేశారని ఆయన వాదించారు.గత నెలలో చోక్సీ బెయిల్ పిటిషన్‌ను డొమినికా హైకోర్టు తిరస్కరించింది. ఫ్లైట్ రిస్క్ కారణాలతో చోక్సీకి బెయిల్ ఇవ్వలేమని పేర్కొంది. చోక్సికి తమ దేశంతో ఎటువంటి సంబంధాల్లేవని, దేశం విడిచి వెళ్లడానికి ఎటువంటి షరతులు విధించబోమని పేర్కొన్నారు.

Related Posts