YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

కరివేపాకులా మాదిరిగా రఘురామకృష్ణరాజు...

కరివేపాకులా మాదిరిగా  రఘురామకృష్ణరాజు...

ఏలూరు, జూలై 14, 
ఏదైనా తెగేదాకా లాగ కూడదంటారు. అలాగే అతి వెగటు కూడా పుట్టిస్తుందంటారు. ఇప్పుడు వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు విషయంలో అదే జరుగుతుంది. ఏదైనా కొంతకాలమే సమయం నడుస్తుంది. అది ఎవరికైనా అదే వర్తిస్తుంది. రఘురామ కృష్ణరాజు ఎవరో తన వెనకున్నారన్న భ్రమలో ఉన్నారు. కాలం కలసి రాకపోతే వారు కనీసం ఇటువైపు కూడా చూడరు. ఆ సంగతి తెలియని ఆయన రోజురోజుకూ రెచ్చిపోతున్నారు. రాజుగారి లేఖలు, ఆయన వ్యవహారశైలి పట్ల సొంత నియోజకవర్గం నర్సాపురం పార్లమెంటు ప్రజలతో పాటు సొంత సామాజికవర్గం సయితం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ టిక్కెట్ మీద విజయం సాధించిన రఘురామ కృష్ణరాజు ఆ పార్టీ అధినేత వైఖరి నచ్చకపోతే బయటకు వచ్చేయాలి. తాను పుడింగిననుకుంటే మళ్లీ పోటీ చేసి గెలవాలి. అంతేతప్ప ఒక పార్టీ మీద గెలిచి అదే పార్టీని, ఆ పార్టీ అధినేతను పదేపదే విమర్శించడం సరికాదు. మొన్నటి దాకా రఘురామ కృష్ణరాజుకు తెలుగుదేశం పార్టీ వెన్నుదన్నుగా ఉండేది. ఆ పార్టీ సోషల్ మీడియా సయితం రఘురామ కృష్ణరాజుకు అండగా నిలిచింది. కానీ రానురాను రఘురామ కృష్ణరాజు వైఖరి విసుగుపుట్టిందేమో ఆయనను వదిలేశారు. ఇక భారతీయ జనతా పార్టీ అండ ఉందని రఘురామ కృష్ణరాజు భావిస్తున్నారు. పదే పదే కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. కానీ బీజేపీ పరిస్థితి ఆయనకు తెలియంది కాదు. తమకు అవసరం లేదనుకుంటే కరివేపాకులా తీసిపారేస్తుంది. ఇప్పుడు బీజేపీకి రఘురామ కృష్ణరాజు అవసరం కన్నా జగన్ అవసరమే ఎక్కువగా ఉంది. అది తెలియని రఘురామ కృష్ణరాజు కాలు దువ్వతున్నారు. అంతా సవ్యంగా జరిగితే మరో మూడేళ్లు మాత్రమే రఘురామ కృష్ణరాజు కు పదవి ఉంటుంది. ఆ తర్వాత పరిస్థితి ఏంటన్నది రఘురామ కృష్ణరాజు అర్థం కావాలి. ఆయన మామూలు రాజకీయ నేత కాదు. పారిశ్రామికవేత్త కూడా. బ్యాంకు రుణాల ఎగవేత కేసులున్నాయి. సీబీఐ, ఈడీలు ఇప్పటికే సోదాలు నిర్వహించాయి. ఏమాత్రం జగన్ గట్టిగా నొక్కితే పాత కేసులు బీజేపీ ప్రభుత్వం తిరగదోడే అవకాశం లేకపోలేదు. కాలం కలసి రాకపోతే చుట్టుపక్కల ఎవ్వరూ ఉండరన్న సంగతిని రఘురామ కృష్ణరాజు గుర్తుంచుకోవాలని ఆయన సామాజికవర్గం పెద్దలే చెబుతుండటం విశేషం.

Related Posts