YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కంసాలిపాలెం, మాధవరం గ్రామాల మధ్య పూర్తిగా నిలిచిపోయిన రాక పోకలు

కంసాలిపాలెం, మాధవరం గ్రామాల మధ్య పూర్తిగా నిలిచిపోయిన రాక పోకలు

ఏలూరు
పశ్చిమగోదావరిజిల్లా నిడదవోలు మండలంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నిడదవోలు మండలం కంసాలిపాలెం, తాడేపల్లి గూడెం మండలం మాధవరం గ్రామాల మధ్య పూర్తిగా రాక పోకలు నిలిచిపో యాయి.గత ఏడాది భారీగా కురిసిన వర్షాలకు ఎర్రకాలువ ఒక్కసారిగా ఉప్పొంగడంతో  భారీగా వరద నీరు చేరి ఎర్రకాలువ వంతెన సగ భాగం పూర్తిగా కుప్పకూలిపోయింది. ఈ ఇరు గ్రామ మధ్య ఉన్న ఎర్రకాలువ వంతెన..సగం తాడేపల్లి గూడెం నియోజకవర్గంలోనూ, సగం  నిడదవోలు నియోజకవర్గంలోనూ ఉండడంతో ఇరు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు వంతులు వేసుకుంటు న్నారని ప్రజలు వాపోతున్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ,  నిడదవోలు నియోజకవర్గ ఎమ్మెల్యే జి.శ్రీనివాస నాయుడులు ఎర్ర కాలువ వంతెన కూలినప్పుడు హుటాహుటిన వచ్చి పరిశీలించి బ్రిడ్జి ని వెంటనే నిర్మిస్తామని హామీ ఇచ్చి, తరువాత ఇటు వైపు కూడా చూడడం లేదని ఇరు గ్రామాల ప్రజలు గగ్గోలు పెడు తున్నారు.నిడదవోలు, తాడేపల్లి గూడెం నియోజకవర్గ ఎమ్మెల్యేలు, అధికారులు పట్టించు కోకపోవడంతో  ప్రత్యాయమనంగా తాత్కాలికoగా ఎర్రకాలువలో తూరలతో రోడ్డును నిర్మించుకున్న రైతులు.గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రైతులు నిర్మించుకున్న తాత్కాలిక రోడ్డు పూర్తిగా  కొట్టుకుపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమి ట్టాడుతున్నారు.తాత్కాలిక రోడ్ కొట్టుకు పోవడంతో కంసాలిపాలెం, మాధవరం గ్రామాల మధ్య  పూర్తిగా రాకపోకలు నిలిచి పోవడంతో వేరే దారి గుండా ప్రయాణం కొనసాగించడం ఇక్కడి ప్రజలకు రైతులకు కష్ట తరంగా మారింది. 25 కిలోమీటర్ల చుట్టూ తిరిగి ప్రయాణం చేసి వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడిందని వారు వాపోతున్నారు. ఇప్పటికైనా ఇరు నియోజకవర్గ శాసన సభ్యులు చొరవ తీసుకుని వెంటనే స్పందించి ఎర్రకాలువ పై వంతెన నిర్మించాలని రైతులు, ప్రజలు కోరుతున్నారు.

Related Posts