న్యూ ఢిల్లీ
ఏపీ సీఎం జగన్రెడ్డికి ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు, వదంతులపై లేఖలో ప్రస్తావించారు. ప్రభుత్వ ఉద్యోగుల పదవీవిరమణ వయసు 60 నుంచి 57 ఏళ్లకు.. తగ్గిస్తున్నారని వదంతులు వస్తున్నాయన్నారు. అన్ని రాష్ట్రాల్లో పదవీ విరమణ వయసు 60-58 ఏళ్లు ఉందని రఘురామ వెల్లడించారు. 57 ఏళ్లకే పదవీ విరమణ వయసు కుదించాలనుకోవడం దారుణమన్నారు. పదవీ విరమణ వయసు తగ్గించే ఆలోచన మానుకోవాలన్నారు. యువకులకు మేలు కలిగించేలా ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగాల కల్పనపై శ్రద్ధ పెట్టాలని సూచించారు. మీ దృష్టిని విధ్వంసంపై నుంచి నిర్మాణాత్మక విధానాలపైకి సారించాలని రఘురామ సూచించారు.