YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

కొత్త మంత్రులతో కేంద్ర కేబినెట్ సమావేశం

కొత్త మంత్రులతో కేంద్ర కేబినెట్ సమావేశం

కొత్త మంత్రులతో కేంద్ర కేబినెట్ సమావేశం
న్యూఢిల్లీ జూలై 14
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపద్యం లో ప్రధాన మంత్రి  నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్ర కేబినెట్ బుధవారంనాడు ప్రధాని మోదీ అధికారం నివాసంలో సమావేశమైంది. ఈ సమావేశం వర్చువల్‌ తరహాలో కాకుండా ఫిజికల్ మీటింగ్ జరగడం ఏడాది తర్వాత ఇదే ప్రథమం. జూలై 7న మంత్రి వర్గ పునర్వవస్థీకరణ తర్వాత మంత్రులంతా సమావేశం కావడం కూడా ఇదే మొదటిసారి. రెండు రోజుల క్రితం కేబినెట్ కమిటీలను పునర్వవస్థీకరించిన తర్వాత ఈ సమావేశం జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది.కోవిడ్‌పై పోరాటంలో ఎలాంటి అలసత్వం వద్దని మంత్రులకు ప్రధాని ఈ సమావేశంలో సూచించారు. ప్రజలు మాస్కులు లేకుండా సామాజిక దూరం పాటించకుండా రద్దీ ప్రాంతాల్లో తిరుగుతున్న ఫోటోలు, వీడియోలు కనిపిస్తున్నాయని, దీంతో అందరిలోనూ ఒకతరహా భయం నెలకొంటోందని అన్నారు. కోవిడ్ ప్రోటోకాల్‌ను ప్రజలు పాటించకపోవడం మంచిది కాదన్నారు. కాగా, పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జూలై 19న ప్రారంభమై ఆగస్టు 13తో ముగుస్తాయి.

Related Posts