YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

 ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో పకడ్భందిగా అమలు చేయాలి నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్

 ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో పకడ్భందిగా అమలు చేయాలి నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్

 ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో పకడ్భందిగా అమలు చేయాలి
నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్
జగిత్యాల , జూలై 14
ప్రజల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న  పథకాలను  క్షేత్రస్థాయిలో పకడ్భందిగా అమలు చేయాలని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు  ధర్మపురి అరవింద్ అన్నారు.  బుధవారం జగిత్యాలలోని సుమంగళి గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన జిల్లా అభివృద్ది  సమన్వయ మరియు   పర్యవేక్షణ కమిటి (దిశ) సమావేశంలో జిల్లా కలెక్టర్ గోగులోత్ రవి , జడ్పీ చైర్మన్ దావ వసంత ,జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్,కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు లతో కలిసి ఆయన పాల్గోన్నారు.ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ శాఖల ద్వారా చేపడుతున్న పలు అభివృద్ధి పథకాలను సమీక్షించారు. ప్రధాన మంత్రి గ్రామీణ్ సడక్ యోజన్ పథకం  కింద 2016-17, 2017-18 సంవత్సరాలలో  రూ.5.48 కోట్ల వ్యయంతో 6 పనులు పూర్తి చేసామని,  ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో  గ్రామీణ్ సడక్ యోజన్ పథకం కింద  రూ.36.28  కోట్లతో 12  రొడ్డు పనులను ,రూ.18.7 కోట్లతో 4 వంతెన నిర్మాణ పనులు మంజూరయ్యాయని అధికారులు వివరించారు. ప్రధాన మంత్రి గ్రామీణ్ సడక్ యోజన్  కింద మంజూరైన పనులకు టెండర్లు  త్వరగా పూర్తి చేసి పనులు ప్రారంభించాలని,   సకాలంలో  రొడ్డు, వంతెన పనులు పూర్తి చేయాలని ఎంపీ ఆరవింద్ ఆదేశించారు.   నిజామాబాద్ నుంచి జగ్దాల్పూర్  వరకు 10 కిలో మీటర్లు  పటిష్ట పర్చుటకు  పనులు ప్రారంభించగా 9 కిమి పనులు పూర్తి చేసామని,  సకాలంలో  మిగిలిన పనులు పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు.  వైద్య శాఖ పై సమీక్షిస్తూ జాతీయ వైద్య  మిషన్ కింద  కేంద్రం నుండి వస్తున్న నిధులను  పకడ్భందిగా అమలు చేయాలని  ఆయన అధికారులకు సూచించారు.  ప్రస్తుత సంవత్సరంలో ఇప్పటి వరకు   ప్రభుత్వ ఆసుపత్రులలో 1327 మందికి కాన్పులు జరిగాయని, 1053 మందికి కేసిఆర్ కిట్లు అందించామని  అధికారులు వివరించారు.  కోవిడ్ 3వ వ్యాప్తి వచ్చే అవకాశమున్నందున  అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎంపీ
అరవింద్ అధికారులను సూచించారు.  జగిత్యాలలో ఆక్సీజన్ ప్లాంట్  ఏర్పాటు చేస్తున్నామని, అదే విధంగా మెట్ పల్లి ప్రాంతంలో సైతం ఎర్పాటుకు ప్రతిపాదనలు సమర్పించామని అధికారులు వివరించారు. 2వ దశ  కరోనా వ్యాప్తి  పీక్ సమయంలో ఉన్న ఆక్సీజన్ డిమాండ్ దృష్టిలో ఉంచుకొని  దానికంటే అధికంగా ఆక్సీజన్ ను సిద్దం చేసుకోవాలని, అదే విధంగా  ఆసుపత్రులలో  ఆక్సీజన్ బెడ్ల సంఖ్య పెంచుకోవాలని ఎంపి సూచించారు. జగిత్యాల జిల్లాలో 229548 మందికి వ్యాక్సిన్ డోసులు  అందించామని  అధికారులు వివరించారు.   డిసెంబర్ 31  వరకు దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి ఉచితంగా  కరోనా వ్యాక్సిన్ అందించే దిశగా  చర్యలు తీసుకుంటున్నామని, దాని కోసం అవసరమైన ప్రణాళిక సిద్దం చేసామని ఎంపీ తెలిపారు.జాతీయ ఆహార భద్రత చట్టం కింద  310619 మందికి  రేషన్  కార్డులు అందించామని,  8638 నూతన రేషన్  కార్డుల జారీ కోసం క్షేత్రస్థాయిలో విచారణ పూర్తి చేసామని  అధికారులు వివరించారు.  ప్రధానమంత్రి ఉజ్వల యోజన  కింద 32769 మందికి గ్యాస్ సిలిండర్లు అందించామని  తెలిపారు.   జాతీయ ఉపాథి  హమి  పథకం  కింద  జగిత్యాల జిల్లాలో  ప్రతి గ్రామంలో డంపింగ్ యార్డులు,   స్మశానవాటికలు,  కాంపోస్ట్ షెడ్లు,  పాం పాండ్లు,  కిచెన్ షెడ్, స్కూల్ టాయిలెట్   మొదలగు  పనులు చేపట్టి పూర్తి చేసామని  తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 40.78 లక్షల పనిదినములు  కల్పన లక్ష్యం  కాగా ఇప్పటి వరకు 18.53 లక్షల పనిదినములను పూర్తి చేసామని  అధికారుల తెలిపారు.  
 హరితహారం  కింద 2020-21 సంవత్సరంలో 63 లక్షల గుంతలు తవ్వి  మొక్కలు నాటామని,  ప్రస్తుత సంవత్సరం 25 లక్షల మొక్కల  పెంపకం లక్ష్యం  కాగా  సుమారు 20 లక్షల గుంతల తవ్వకం పూర్తి చేసామని అధికారులు వివరించారు.   హరితహారంలో నాటిన మొక్కల  సంరక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని, అవెన్యూ ప్లాంటేషన్ లో పెద్ద మొక్కలు నాటాలని ఎంపి సూచించారు.  జాతీయ సామాజిక భద్రత పథకం  కింద  జగిత్యాల జిల్లాలో 21549 మందికి   కేంద్ర ప్రభుత్వం ద్వారా  ప్రతి నెల 69 లక్షలు,    రాష్ట్ర ప్రభుత్వం ద్వారా 4 కోట్ల34 లక్షలు   ఫించన్ అందిస్తున్నామని,   కేవలం    రాష్ట్ర ప్రబుత్వం ద్వారా మాత్రమే 206949 మందికి  ప్రతి నెల  రూ.43 కోట్ల 40 లక్షల  ఫించన్ సోమ్ము విడుదల అవుతుందని   అధికారులు వివరించారు.   జాతీయ ఆహారం  భద్రతా మిషన్  కింద  నూనె గింజలు పంట సాగు,  పప్పు గింజలు  పోత్సహించుటకు ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలని ఎంపీ అరవింద్ సూచించారు.
పిఎం కిసాన్  కింద 123871 మంది రైతులకు రూ.144.19 కోట్ల  జమ చేసామని అధికారులు వివరించారు.  ప్రస్తుత సంవత్సరం జూన్ చివరి వరకు  8 యూనిట్లు  రూ.24.59 లక్షల సబ్సీడితో  ఎర్పాటు చేయడం లక్ష్యం కాగా ఇప్పటి వరకు  రూ.26.59 లక్షల మార్జిన్ మనీతో 9 యూనిట్లు ఎర్పాటు చేసామని  తెలిపారు.  ప్రధానమంత్రి ఖనిజ క్షోత్ర కళ్యాణ్ యోజన్   కింద ప్రస్తుత సంవత్సరం 28.4 కోట్లతో 15 పనులు మంజూరు చేసామని,  వాటి పనులు త్వరగా ప్రారంభించాలని ఎంపీ సూచించారు. సమావేశంలో మాట్లాడిన  జిల్లా కలెక్టర్ జి. రవి మాట్లాడుతూ  ప్రోటోకాల్ ఇబ్బందులు  ఎర్పడకుండా పకడ్భంది చర్యలు తీసుకుంటామని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలను క్షేత్రస్థాయిలో   అర్హులకు అందే విధంగా అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో  పనిచేయాలని  కలెక్టర్  తెలిపారు.   ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీలలో  ప్రైవేటు వ్యక్తుల ఫోటోలు ఉండకుండా చర్యలు తీసుకుంటామని,ఆధారాలతో ఫిర్యాదు చేస్తే విచారణ జరిపిస్తామని తెలియచేసారు.ఒకవేళ అధికారికంగా పోరపాటు జరిగితే  సదరు అధికారుల  పై చర్యలు తీసుకుంటామని  తెలిపారు.ఈ సమావేశంలో జడ్పీ చైర్మన్  దావావసంత,  జగిత్యాల ఎమ్మెల్యే  డా.సంజయ్ కుమార్,కొరుట్ల ఎమ్మెల్యే కె. విద్యాసాగర్ రావు, మండల పరిషత్ అధ్యక్షులు, చైర్పర్సన్లు,నామినేటెడ్ సభ్యులు,సంబంధిత జిల్లా అధికారులు తదితరులు పాల్గోన్నారు

Related Posts