YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

మొక్కలు నాటిన జిల్లా ఎస్పీ రంజన్ రతన్ కుమార్

మొక్కలు నాటిన జిల్లా ఎస్పీ రంజన్ రతన్ కుమార్

మొక్కలు నాటిన జిల్లా ఎస్పీ రంజన్ రతన్ కుమార్
జొగులాంబ గద్వాల
సమాజంలో మొక్కలను పెంచడం ప్రతి ఒక్కరి ప్రథమ బాధ్యతగా భావించి ముందుకు రావాలని జిల్లా ఎస్పీ రంజన్ రతన్ కుమార్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఏడో విడత హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. శనివారం మానవపాడు మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ లో చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని ఎస్పీ రంజన్ రతన్ కుమార్ చేతుల మీదుగా ప్రారంభించారు. ముందుగా ఎస్పీ రంజన్ రతన్ కుమార్ ను సీఐ వెంకటేశ్వర్లు ఎస్సై సంతోష్ కుమార్ ఘనంగా శాలువా పూల బొకేలతో సన్మానించుకున్నారు. ఆ గ్రామాల సర్పంచులు,ఎంపీటీసీలు , హెల్త్ ఆశ వర్కర్లు , ఆటో యూనియన్ వర్కర్లు, వివిధ గ్రామాల యువకులతో కలిసి పోలీస్  స్టేషన్ లోని ఆవరణలో సుమారు 500కు పైగా మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సమాజంలో మొక్కల పెరుగుదల చాలా ముఖ్యమైనదని, కావున ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి భావితరాలకు ఉపయోగకరంగా ఉండే విధంగా తోడ్పడాలి అన్నారు. అదేవిధంగా అలంపూర్ మండల పరిధిలోని గొంది మల్ల గ్రామంలో హరితహారం కార్యక్రమం లో అల్లంపూర్ సిఐ వెంకట్రామయ్య సర్పంచ్ వసుంధర పెద్దారెడ్డి జంబుకేశ్వర ఆలయం దగ్గర   అల్లంపూర్ ఎస్ ఐ మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏడో విడత హరితహారం మొక్కల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన హరితహారం కార్యక్రమం ఒక మహత్తరమైన కార్యక్రమమని మొక్కలు నాటడం ద్వారా పచ్చదనం ఏర్పడుతుందని. చెట్ల ద్వారా మనకు గాలిని ఇస్తుంది. అంతేకాక ఇంటి నిర్మాణానికి కావలసిన కిటికీలు తలుపులు దర్వాజల కు చెట్లు ఉపయోగపడతాయని . మనకు ఆక్సిజన్ చెట్ల ద్వారానే అందుతుందని జిల్లా ఎస్పీ అన్నారు. ప్రతి ఒక్కరు చెట్లను నాటడం లో తమ వంతు కృషి చేయాలని తమ వంతు బాధ్యతగా చెట్లు నాటాలని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ అశోక్ కుమార్ ఎంపీడీవో రమణారావు సీఐ వెంకటేశ్వర్లు ఎస్ఐ సంతోష్ కుమార్ ఆయా గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు పోలీస్ సిబ్బంది ఇది ఆశ కార్యకర్తలు గ్రామ ప్రజలు యువకులు తదితరులు ఉన్నారు.

Related Posts