YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

శాంతియుతంగా బక్రీద్

శాంతియుతంగా బక్రీద్

శాంతియుతంగా బక్రీద్
నల్గొండ, జూలై 14, 
క్రీద్ పండుగను శాంతియుత వాతావరణంలో ఎవరికి ఇబ్బంది కలిగించకుండా జరుపుకోవాలని డీఐజీ ఏవీ రంగనాధ్ కోరారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ముస్లిం పెద్దలు, హిందూ సంస్థల ప్రతినిధులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బక్రీద్ పర్వదినోత్సవ సందర్భంగా పశువుల తరలింపు విషయంలో అన్ని రకాల అనుమతులు, నిబంధనలు పాటించాలన్నారు. ప్రభుత్వ నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.పశువుల తరలింపులో వెటర్నరీ శాఖ అధికారులు ధృవీకరించన తర్వాత అనుమతిస్తామని చెప్పారు. గోవుల తరలింపుపై నిషేధం ఉన్న క్రమంలో నిబంధనలు పాటించకుండా గోవులను తరలిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అన్ని వర్గాల ప్రజలు, ప్రజా ప్రతినిధులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా పోలీసులతో సహకరించాలని సూచించారుమత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యక్తులపై, వారి కదలికలపై నిఘా పెట్టామన్నారు. సమావేశంలో గోలి మధుసూదన్ రెడ్డి, వీరెల్లి చంద్రశేఖర్, హఫీజ్ ఖాన్, ముంతాజ్ అలీ, ఎస్.బి. డిఎస్పీ రమణా రెడ్డి, నల్లగొండ వన్ టౌన్, టూ టౌన్ సీఐ బాలగోపాల్, చంద్రశేఖర్ రెడ్డి, టూ టౌన్ ఎస్.ఐ. నర్సింహులు, శాంతి సంఘం సభ్యులు తదితరులున్నారు.

Related Posts