YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

 మూసీకి భారీ వరద

 మూసీకి భారీ వరద

 మూసీకి భారీ వరద
హైదరాబాద్, జూలై 14,
తెలంగాణ వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పలు ప్రాజెక్టులు కళకళలాడుతున్నాయి. ప్రాజెక్టులకు భారీగా వరద నీరు చేరింది. అన్ని ప్రాజెక్టులకు వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. సూర్యాపేట జిల్లాలోని మూసీ ప్రాజెక్టు నిండు కుండలా తొణికిసలాడుతోంది. భారీగా వస్తున్న వరదతో మూసీ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకున్నది.ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 642.5 ఫీట్లు కాగా, ప్రస్తుత నీటి మట్టం 645 ఫీట్లుగా ఉంది. దీంతో మొత్తం నాలుగు గేట్ల ( 2,4,6,8) ద్వారా 2,600 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. క్రస్ట్ గేట్లు ఎత్తడంతో దిగువున ఉన్న లోతట్టు ప్రాంతాలను, నది సమీప గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు.. చేపల వేటకు వెళ్లకుండా మత్స్యకారులకు సమాచారం అందించారు.
ఎల్లంపల్లికి నీరు
టీవల కురుస్తున్న భారీ వర్షాలకు ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండుకుండలా మారి జలసిరి సంతరించుకుంది. రుతుపవనాలు, అల్పపీడన ద్రోణి ప్రభావంతో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టుకు ఎగువన ఉన్న ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం మేరకు చేరుకోవడంతో బుధవారం మధ్యాహ్నం ఎల్లంపల్లి వైపు రెండు గేట్లను ఎత్తి దిగువకు అధికారులు నీటిని వదిలారు.కాగా ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 20.175, లెవల్ 48 మీటర్లకు చేరుకోవడంతో ఎగువ ప్రాంతాల నుంచి టీఎంసీల వరద నీరు వచ్చి చేరుతుండడంతో ముందస్తుగా రెండు గేట్ల ద్వారా నీటిని వదిలినట్లు అధికారులు తెలిపారు. నీటి విడుదలపై అధికారులను ముందస్తు సమాచారం అందించి అప్రమత్తం చేశామని, గోదావరి పరివాహక ప్రాంతాల కు ప్రజలు ఎవరు వెళ్లుద్దు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

Related Posts