YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఇక సచివాలయాలు ముగిసినట్టేనా

ఇక సచివాలయాలు ముగిసినట్టేనా

విజయవాడ, జూలై 15, 
జగన్ మనసులో పుట్టిన గొప్ప ఆలోచన గ్రామ సచివాలయాలు అని వైసీపీ నేతలు చెబుతారు. కానీ ఏ వ్యవస్థ అయినా రాజ్యాంగబద్ధంగానే ఉండాలి. అంతే కాదు, అవి మరో వ్యవస్థలో చొచ్చుకుపోరాదు. అధికారాలు నిండా లాగేసుకోరాదు. కానీ చూడబోతే గ్రామ సచివాలయాలు కచ్చితంగా పంచాయతీల పునాదులను పెకిలించేలాగానే ఉన్నయి. గ్రామ పంచాయతీల పాలన అయిదారు వందల జనాభా నుంచి మొదలవుతుంది. ఒక విధంగా చెప్పాలంటే ప్రజలకు ఇంత దగ్గరగా పాలన చేసే మరో వ్యవస్థ లేదు. అలాగే పంచాయతీఅలోని వార్డు మెంబర్లు ఉన్నారంటే వారు ప్రతీ యాభై మందికి ప్రతినిధులుగా వ్యవహరిస్తారు. గ్రామాలలో కొత్తగా వచ్చిన సచివాలయాలు సమాంతరంగానే ఉన్నాయని చెప్పాలి. ఇక్కడ కూడా ప్రతీ యాభై కుటుంబాలకు ఒక వాలంటీర్ ని నియమిస్తున్నారు. ఆ వాలంటీర్ కూడా ప్రజల బాగోగులు చూడడానికే అంటున్నారు. మూడేళ్ళుగా పంచాయతీలకు ఎన్నికలు లేవు కాబట్టి సచివాలయాల హవా సాగింది. ఇపుడు పంచాయతీలకు కొత్త పాలక వర్గాలు వచ్చేశాయి. వాటి పాలన సాగాలి అంటే సచివాలయ వ్యవస్థ అడ్డుపడుతోంది అంటున్నారు. చాలా వరకూ ఇది నిజమే అంటున్నారు. ఎందుకంటే ఇద్దరూ ఒకే పని చేస్తే అక్కడ ఘర్షణకే ఆస్కారం ఉంటుంది.మరో వైపు చూస్తే జీవో నంబర్ 2 అంటూ వైసీపీ సర్కార్ గ్రామ సచివాలయ వీయార్వోలకు కొన్ని పంచాయతీ పవర్లను కట్టబెట్టింది. వారంతా కోర్టుకు వెళ్లాక కోర్టు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేసింది. జీవోను కూడా సస్పెండ్ చేసింది. పైగా పంచాయతీల అధికారాలు, హక్కులను హరాయించేదిగా కూడా భావిస్తున్నారు. సంక్షేమ పధకాలను గ్రామ పంచాయతీల ద్వారానే ఇవ్వవచ్చు కదా అని కోర్టు ప్రశ్నించడం చూస్తూంటే సచివాలయాలకు మూడినట్లే కనిపిస్తోంది.ఒక వైపు రాజ్యాంగ వ్యవస్థలుగా పంచాయతీలు ఉన్నాయి. మరో వైపు వైసీపీ తెచ్చిన సచివాలయాలు ఉన్నాయి. పంచాయతీ అధికారాలకు కోత వేసేలా కొత్త వ్యవస్థ రూపకల్పన ఉందని అభిప్రాయం వస్తోంది. అయితే అలాంటిదేమీ లేదని, ఎవరి పని వారిదే అని వైసీపీ మంత్రులు అంటున్నారు. తాము సచివాలయాలను కొనసాగించి తీరుతామని చెబుతున్నారు. అయితే ఇప్పటికే సచివాలయాల మీద ఘాటు వ్యాఖ్యలు చేసిన హై కోర్టు తుది తీర్పు ఏ విధంగా ఇస్తుంది అన్నది ఆసక్తికరంగా ఉంది. అయితే సచివాలయాలు వైసీపీకి రాజకీయంగా పదునైన ఆయుధంగా ఉన్నాయి. కాబట్టి ఇప్పటిలో ఈ పంచాయతీ తేలే చాన్స్ లేదు అంటున్నారు.

Related Posts