YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

మేయర్లకు కలిసి రాని కాలం

మేయర్లకు కలిసి రాని కాలం

విజయవాడ, జూలై 15, 
విజయవాడ నగరపాలక సంస్థకు సుదీర్ఘ చరిత్ర ఉంది. అయితే ఇక్కడ కార్పొరేటర్లుగా చేసిన వాళ్లు ఎమ్మెల్యేలు అయ్యారు. కానీ మేయర్లుగా పనిచేసిన వారు మాత్రం రాజకీయంగా ఎదుగుదల లేదు. ఈ సెంటిమెంట్ మాత్రం విజయవాడ నగరపాలక సంస్థ మేయర్లను వెంటాడుతూనే ఉంది. మేయర్ పదవి చేపట్టారంటే వారి రాజకీయ ప్రస్థానం అంతటితో ముగిసినట్లేనన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో బాగా విన్పిస్తుంది. ఒకప్పుడు రాజకీయ రాజధానిగా ఉన్న బెజవాడ మేయర్లకు మాత్రం పదోన్నతి దక్కలేదు.విజయవాడ నగర పాలకసంస్థ 1981లో ఏర్పడింది. అప్పటి నుంచి అనేక మంది మేయర్లుగా పనిచేశారు. జంద్యాల శంకర్, టి. వెంకటేశ్వరరావు వంటి ప్రముఖ నేతలు మేయర్లుగా పనిచేశారు. విజయవాడ తూర్పు (అప్పటి) నియోజకవర్గంలో బ్రాహ్మణ సామాజికవర్గం ఓట్లు ఎక్కువ. అయినా ఇక్కడ నుంచి జంద్యాల శంకర్ పోటీ చేసి చట్ట సభలకు వెళ్లలేదు. ఆయనకు విజయవాడ నగరంలో మంచిపేరున్నా రాజకీయంగా మేయర్ పదవితోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.ఇక టి.వెంకటేశ్వరరావు మేయర్ గా పనిచేసి నగర ప్రజల మన్ననలను పొందరు. సీపీఐకి చెందిన టి.వెంకటేశ్వరరావు మేయర్ గా అవినీతి రహిత పాలన అందించారు. రెండుసార్లు మేయర్ గా ఎన్నికైన టి.వెంకటేశ్వరరావు ఎమ్మెల్యేగా మాత్రం పదోన్నతి పొందలేకపోయారు. అప్పట్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సీపీఐకి స్ట్రాంగ్ గా ఉండేది. కానీ ఇక్కడ నుంచి గెలిచి టి.వెంకటేశ్వరరావు శాసనసభ్యుడు కాలేకపోయారు. మేయర్ పదవితోనే సర్దుకోవాల్సి వచ్చింది.ఆ తర్వాత పంచుమర్తి అనురాధ టీడీపీ మేయర్ గా ఎన్నికయ్యారు. ఐదేళ్లు మేయర్ గా పనిచసిన అనూరాధ టీడీపీలో నేటికీ కొనసాగుతున్నా ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా పదోన్నతిని పొందలేక పోయారు. ఆ తర్వాత మేయర్ పదవిని చేపట్టిన కోనేరు శ్రీధర్ మేయర్ తోనే సరిపుచ్చుకోవాల్సి వచ్చింది. విజయవాడ నగరపాలక సంస్థ మేయర్ చరిత్రను చూస్తే మేయర్ గా బాధ్యతలను చేపట్టిన వారు మాత్రం రాజకీయంగా ఎదగలేకపోయారు. కౌన్సిలర్లు, కార్పొరేటర్లుగా పనిచేసిన వంగవీటి రంగా, సుబ్బరాజు వంటి వారు మాత్రం ఎమ్మెల్యేలు కావడం విశేషం.

Related Posts