YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

మళ్లీ వాయిదా పడ్డ టిడ్కో గృహాలు

మళ్లీ వాయిదా పడ్డ టిడ్కో గృహాలు

విజయవాడ, జూలై 15, 
టిడిపి హయాంలో నిర్మాణాలు ప్రారంభమైన టిడ్కో గృహాలు లబ్ధిదారులకు ఇప్పటికీ పంపిణీ చేయకపోవడంతో వారిలో ఆందోళన మొదలైంది. ప్రభుత్వం అరకొరగా విడుదల చేస్తున్న నిధులను పరిశీలిస్తే ఇప్పట్లో లబ్ధిదారులకు టిడ్కో గృహాలు దక్కే పరిస్థితి లేకుండా పోతుందనే అభిప్రాయానికి బలం చేకూరుతోంది. లబ్ధిదారుల సొంతింటి కల ఏళ్ల తరబడి నెరవేరకపోవడంతో పాటు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న లబ్ధిదారుల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా తయారైంది. గత ప్రభుత్వ హయాంలో 3,13,832 గృహాలు గ్రౌండింగ్‌ చేయగా, వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత అనర్హులని పేర్కొంటూ రాష్ట్రవ్యాప్తంగా 50 వేల మందిని అర్హుల జాబితా నుంచి తొలగించారు. మిగిలిన 2,62,216 గృహాల జాబితాను అర్హులుగా ప్రకటించారు. ఇప్పటికి పూర్తయి పంపిణీకి సిద్ధంగా ఉన్న ఇళ్లు కేవలం 85 వేలు మాత్రమే. మరో 95 వేల ఇళ్లు సివిల్‌ పనులు పూర్తయినప్పటికీ ఇంటీరియర్‌ పనులు పూర్తికాలేదు. మిగిలిన 74,312 గృహాలు బేస్‌మట్టం లెవెల్‌లో నిర్మాణాలు ఉన్నాయి. టిడ్కో ప్రాజెక్టు మొత్తం విలువ రూ.22 వేలకోట్లు కాగా, ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా రూ.4 వేల కోట్లు, లబ్ధిదారుని వాటా రూ.4 వేల కోట్లు, మిగిలిన రూ.14 వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న గృహాలు పూర్తికావాలంటే సుమారు రూ.12 వేల కోట్ల నిధులు అవసరమవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.అమరావతి రాజధాని ప్రాంతంలో టిడ్కో నిర్మించిన గృహాలకు మౌలిక వసతులు, రవాణా, తాగునీరు లాంటి కనీస సదుపాయాలు కల్పించేందుకు రూ.42 కోట్లు అవసరమని ప్రభుత్వ గణాంకాలు సూచిస్తున్నాయి. రాష్ట్ర మౌలిక వసతులు (ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌) కల్పిస్తే ఐదు వేల గృహాలను లబ్ధిదారులకు పంపిణీ చేసే అవకాశం ఉంది. అంతేకాకుండా లబ్ధిదారులకు కేవలం అలాట్‌మెంట్‌ పత్రం మాత్రమే ఇచ్చిన ప్రభుత్వం ఇళ్ల స్వాధీనానికి ముందుకు రావడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. రాజధాని ప్రాంతమంతా సిఆర్‌డిఎ పరిధిలో ఉండటం, ఆ చట్టం నేడు కోర్టు పరిధిలో ఉండటం కూడా మౌలిక వసతులు కల్పించకపోవడానికి కారణమై ఉండొచ్చని పలువురు భావిస్తున్నారుపట్ణణ ప్రాంతాల్లో 300 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్న టిడ్కో ఇళ్లకు బ్యాంకు రుణాల రద్దు ప్రక్రియ నూరుశాతం పూర్తికాకపోవడంతో లబ్ధిదారుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ ఇళ్లకు సంబంధించి బ్యాంకు రుణాలు లబ్ధిదారుడు చెల్లించకుండా ప్రభుత్వమే రుణాన్ని చెల్లించి, రూ.1కే లబ్ధిదారుని ఇంటిని అప్పజెబుతుందని ప్రకటించారు. ఈ ప్రక్రియ నేటికీ నూరుశాతం పూర్తికాకపోవడంతో లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 3 వేల గృహాలకు సంబంధించి బ్యాంకుల నుంచి రూ.92 కోట్లు రుణాలుగా తీసుకున్నట్లు తెలిసింది. వడ్డీతో కలిపి నేటి వరకు ఈ రుణం మొత్తం రూ.100 కోట్లకు చేరినట్లు అంచనా. ఇందులో రుణాలకు సంబంధించి ప్రభుత్వం రూ.50 కోట్లు మాత్రమే జమ చేసినట్లు సమాచారం.365, 430 చదరపు అడుగుల్లో నిర్మిస్తున్న టిడ్కో గృహాలకు లబ్ధిదారుని వాటా కింద చెల్లించిన నగదును 50 శాతానికి కుదించిన ప్రభుత్వం ఆ నగదును వెనక్కి ఇవ్వలేదని తెలిసింది. రూ.50 వేలు చెల్లించిన లబ్ధిదారునికి రూ.25 వేలు, లక్ష చెల్లించిన లబ్ధిదారుని వాటా రూ.50 వేలకు ప్రభుత్వం కుదించిన సంగతి పాఠకులకు విధితమే. ఈ విధంగా చెల్లించాల్సిన నగదు సుమారు రూ.500 కోట్లు వరకు ఉండొచ్చని అంచనా. అనర్హులంటూ జాబితా నుంచి తొలగించిన 50 వేల మందికి సంబంధించి వారు చెల్లించిన వాటా రూ.65 కోట్ల వరకు పెండింగ్‌లోనే ఉంది. లబ్ధిదారుని వాటా ఆయా మున్సిపల్‌ కార్పొరేషన్లు చెల్లించాలని ప్రభుత్వం ఆదేశించినట్లు తెలిసింది. నిధుల లేమితో అల్లాడుతున్న మున్సిపల్‌ కార్పొరేషన్లు లబ్ధిదారుని వాటా తాము చెల్లించే పరిస్థితిలో లేమని, ప్రభుత్వమే నిధులు సమకూర్చాలని కోరినట్లు సమాచారం.

Related Posts