కాస్టింగ్ కౌచ్, సినీ పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటం వెనక్కి తగ్గేది లేదని శ్రీరెడ్డి చెప్పారు ఈ సందర్భంగా శ్రీరెడ్డి తరుపు లాయర్ 'మా' అసోసియేషన్ గురించి, ఇందులో పవన్ కళ్యాణ్ అసోసియేషన్‌ను ఎలా కంట్రోల్ చేస్తున్నారో వెల్లడించారు. పవన్ సినిమా 894 మంది డమ్మీలు, పవన్ ఏమన్నా నోరు మెదపలేదు తెలంగాణ సొసైటీస్ రిజిస్ట్రేషన్స్ కింద రిజిస్టర్ అయిన ఒక సంస్థ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్. ఇందులో 900 మంది మెంబర్స్ ఉన్నారు. ఈ మెంబర్స్ వాళ్లలో ఒక ప్యానల్ ను ఎన్నుకుని ఒక చైర్మన్, ఒక సెక్రటరీ ఇలా అందరినీ ఎన్నకుంటారు. పవన్ కళ్యాణ్ గారు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ను సొంత ఇల్లు లాగా వాడుకుని అందులో ఉన్న 900 మంది మెంబర్స్ కాన్ఫిడెన్స్ తీసుకున్నట్లుగా ఎవరికీ ఎలాంటి సభ్యంతరాలు లేనట్లుగా మాట్లాడుతూ కొన్ని కామెంట్స్ చేశారు. మరి అలాంటి కామెంట్స్ చేసినపుడు అసోసియేషన్లో ఉన్న ఒక్కరు కూడా నోరు మొదపలేదు. అంటే దానర్థం 900 మందిలో ఈ ఆరుగురు పోతే 894 మంది డమ్మీలు... అని శ్రీరెడ్డి లాయర్ తెలిపారు. అలా ప్రవర్తించడం తప్పు కంప్లీట్ ఈ అసోసియేషన్ ఆరుగురి చేతుల్లో ఉంది. దానికి ఒక ప్రెసిడెంట్ శివాజీ రాజాను పెట్టి ... దాంట్లో చిరంజీవి ఫ్యామిలీ, పవన్ కళ్యాణ్,నాగబాబు, కృష్టం రాజు, ఎవరైతే ఇద్దరు ముగ్గురు టాప్ మోస్ట్ గ్రేడ్ 1 హీరోలు ఉన్నారో వారికి చెందినదే ఈ ‘మా', మిగతా జూనియర్ ఆర్టిస్టులకు సంబంధం లేదు అనే ప్రవర్తన ఏదైతో ఉందో అది తప్పు... అని శ్రీరెడ్డి లాయర్ తెలిపారు. ఆర్టీఏ ద్వారా అన్నీ బయటకు, సుప్రీంలో పిటీషన్ అసలు మా అసోసియేషన్ నిబంధనలు ఏమిటి? చట్ట ప్రకారం జనరల్ బాడీ మీటింగ్ పెట్టడానికి మూడు రోజుల ముందు నోటీసు ఇవ్వాలి. మరి అలాంటి నోటీస్ ఏమైనా ఇచ్చారా? రేపు ఆర్టీఏలో అన్ని బయటకు తీపిస్తాం. సుప్రీం కోర్టు నుండి పిటీషన్ వేసి కంప్లీట్ డాక్యుమెంట్స్ సుప్రీం కోర్టులో సబ్ మిట్ చేయమని అడుగుతాం. అపుడు అన్ని తెలుస్తాయి. రేపు కోర్టుకు సమాధానం చెప్పుకోవాలి ఆ రోజు ‘మా' అసోసియేషన్ మీటింగ్ ఎవరు పెట్టారు. ఎజెండా ఏమిటి? ఎవరు ఇదంతా చేశారు. ఎంత మంది మీరు తీసుకున్న నిర్ణయాన్ని ఒప్పుకుంటూ సంతకం చేశారు. ఇవన్నీ రేపు కోర్టుకు వస్తే ఎవరూ కూడా ఆన్సర్ చెప్పలేని పరిస్థితిలో ఉంటారు. ప్రతి ఒక్కరూ శ్రీరెడ్డి ఫైల్ చేసే డ్యామేజ్ సూట్ కు ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది... అని శ్రీరెడ్డి లాయర్ తెలిపారు. పవన్ కళ్యాణ్‌కు ఏమీ కాదు, తప్పు చేస్తే మీకే శిక్ష పడుతుంది ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు కూర్చుని ఫ్యాన్స్‌కు సపోర్టుగా ఉండాలని ఏదైతే సిగ్నల్ ఇచ్చారో, ఆ సిగ్నల్‌ను బేస్ చేసుకుని ఎవరైతే రాళ్లు వేశారో... రాయి వేసే ప్రతి వ్యక్తి అమాయకుడే. వారికి చట్టం గురించి తెలియదు. రేపు కోర్టుకు సాక్షానికి వచ్చి నిలబడినపుడు పవన్ కళ్యాణ్ వచ్చి భుజం మీద చేయేసి మాట్లాడరు. నువ్వు ఒక్కడివే కోర్టు హాలులో ఉంటావు. శిక్ష పడితే నిన్నే జైల్లో వేస్తారు తప్ప పవన్ కళ్యాణ్‌ను పంపరు. కాబట్టి ఎవరైనా ఇలాంటి వాటికి రెచ్చిపోయి ఎటువంటి ప్రక్రియకు పాల్పడినా సొంతంగా దీనికి బాధ్యత తీసుకుని అనుభవించాలే తప్ప దానికి పవన్ కళ్యాణ్ ఏవిధంగా బాధ్యుడు కాదు... అని శ్రీరెడ్డి లాయర్ తెలిపారు.