YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

కొండ కుమ్మర్ల పై సర్వే

కొండ కుమ్మర్ల పై సర్వే

కొండ కుమ్మర్ల పై సర్వే
విశాఖపట్నం
అరకు నియోజక వర్గ పరిధిలో వున్న కొండ కుమ్మర్లను మన్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు సర్వే నిర్వహించారు. గురువారం నాడు అరకు మండల పార్టీ అధ్యక్షుడు కొర్ర గాసి  ఆధ్వర్యంలో మండల టీమ్ మాడగడ పంచాయితీలో పర్యటించింది. ఈ సందర్భంగా కొర్ర గాసి  మాట్లాడుతూ దశాబ్దాల పాటు ఏజెన్సీ ప్రాంతంలో దుర్భర జీవితం గడుపుతున్న,కొండ కుమ్మరిలు,ఎన్నో ఏళ్ల నుండి ఏజెన్సీ ప్రాంతంలో ఉంటున్న కూడా ఎస్టీ జాబితా లేకుండా వేరే ఏ జాబితాలో కూడ రిజర్వేషన్లు లేకుండా అటు ఇటు గా మధ్యలో ఉన్న కొండ కుమార్ల,కష్టాలు,వర్ణనాతీతమని అన్నారు. ఈ ప్రాంతంలో అరకు ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ  2019 ఎన్నికల ప్రచారంలో భాగంగా వారి గ్రామాల్లో పర్యటించి వారి, జీవన స్థితిగతులను చూసి చలించిపోయి,మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి,నేను ఎమ్మెల్యే అయితే తప్పకుండా మీ సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లి,మీకు న్యాయం చేస్తానని మాట ఇచ్చి, ఈ సంవత్సరం తన వివేకంతో ప్రభుత్వాన్ని మెప్పించి,ఒప్పించి పట్టుదలతో కృషి చేసి ఇటీవలే కొండ కుమ్మరి లను ఎస్టీ జాబితాలో చేర్చే అంశంపై ప్రభుత్వ అధికారులు మన్యం లో పర్యటించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారి ఆదేశాలు మేరకు ఈ రోజు అరకు మండల టీం మాడగడ పంచాయతీలో పర్యటించి కొండ కుమ్మరులకు సంఘీభావం తెలిపారు. మీకు అండగా సీఎం జగన్, అరకు ఎంపీ గొడ్డేటి మాధవి, అరకు ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ  ఉంటారని మండల టీం భరోసానిచ్చారు.
 ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్,జ్యోతి, పీయేసీ  చైర్మన్ శ్రీను, సీనియర్ నాయకులు, లక్ష్మణ్, రామ్మూర్తి, బాలరాజు అప్పలస్వామి, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Related Posts