YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

పెట్రోల్ ధరలపై శుక్రవారం కాంగ్రెస్ అందోళన రేవంత్ రెడ్డి,

పెట్రోల్ ధరలపై శుక్రవారం కాంగ్రెస్ అందోళన రేవంత్ రెడ్డి,

పెట్రోల్ ధరలపై శుక్రవారం కాంగ్రెస్ అందోళన
రేవంత్ రెడ్డి,
హైదరాబాద్
దేశంలో అత్యంత ధనవంతుడు నుంచి పేద వాడి వరకు నరేంద్ర మోడీ, కేసీఆర్ దోపిడీ లకు బలవుతున్నారని టీపీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు. కరోనా సమయంలో తినడానికి తిండి లేకుండా.. నడుచుకుంటూ పోతుంటే .. చమురు ధరలపై భారం మోపారు.  7 ఏళ్లలో 36 లక్షల కోట్లు దోచుకున్నారని అయన అన్నారు.
పెట్రోల్ వాస్తవ ధర 40 రూపాయలు మాత్రమే. 32 రూపాయలు కేసీఆర్, 35 రూపాయలు మోడీ వసూలు చేస్తున్నారు. ధనవంతులు తిరిగే విమానాల్లో కేవలం ఒక్క రూపాయి వసూలు చేస్తోంది. పేదలపై మాత్రమే 32 రూపాయలు వసూలు చేస్తున్నారు. ధనవంతులకు మినహాయింపు ఇచ్చి.. పేదలపై మాత్రం భారం మోపుతున్నారని అన్నారు.
రేపు.. ధర్నా చౌక్ నుంచి రాజ్ భవన్ వరకు ర్యాలీ గా వెళ్లి వినతిపత్రం ఇస్తాం. బంగ్లాదేశ్, బర్మా , పాకిస్థాన్ , నేపాల్ వంటి దేశాల్లో మన కంటే తక్కువ కే 30 నుంచి 40 మధ్యనే అందిస్తున్నారు. ప్రజలను దోచుకోవడానికి కోవిడ్ నిబంధనలు అడ్డు రావు కాని.. నిరసనకు అడ్డు వస్తాయా. పార్లమెంట్ లో కూడా ఈ ధరల అంశాన్ని నిలదీస్తాం. రేపటి నిరసన కార్యక్రమానికి కాంగ్రెస్ శ్రేణులు తరలి రావాలి. రేపటి ర్యాలీ సందర్భంగా అరెస్టు లు చేస్తే ఎలా ఎదుర్కొవాలో మాకు తెలుసు.. అరెస్టు లు చేస్తే.. చలో జైల్ భరోసా నిర్వహిస్తాం. పోలీస్ స్టేషన్ ముట్టడి చేస్తాం.. ఎంత మందిని అరెస్ట్ చేస్తారో చూస్తామని అన్నారు.

Related Posts