దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు
న్యూఢిల్లీ జూలై 15
దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. బుధవారం 38,792 కేసులు నమోదు కాగా తాజాగా 41 వేలకుపైగా రికార్డయ్యాయి. ఈ సంఖ్య నిన్నటికంటే 7.7 శాతం అధికమని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 41,806 పాజిటివ్ కేసులు కొత్తగా నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,09,87,880కు చేరింది. ఇందులో 3,01,43,850 మంది కరోనా నుంచి కోలుకోగా, మరో 4,32,041 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు 4,11,989 మంది మహమ్మారి వల్ల మరణించారు. ఇక బుధవారం ఉదయం నుంచి ఇప్పటివరకు 39,130 మంది కొత్తగా డిశ్చార్జీకాగా, 581 మంది మృతిచెందారని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ముమ్మరంగా సాగుతున్నది. గత 24 గంటల్లో 34,97,058 డోసులు పంపిణీ చేశామని వెల్లడించింది. దీంతో ఇప్పటివరకు వ్యాక్సిన్ తీసుకున్నవారి సంఖ్య 39,13,40,491కు చేరిందని తెలిపింది. జూలై 14 వరకు దేశవ్యాప్తంగా 43,80,11,958 నమూనాలను పరీక్షించామని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎమ్మార్) ప్రకటించింది.