YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఆ సౌర తుఫాను భూమిని చుట్టుముట్టి వెళ్లిపోయింది: ఎన్ఓఏఏ

ఆ సౌర తుఫాను భూమిని చుట్టుముట్టి వెళ్లిపోయింది: ఎన్ఓఏఏ

ఆ సౌర తుఫాను భూమిని చుట్టుముట్టి వెళ్లిపోయింది: ఎన్ఓఏఏ
న్యూ ఢిల్లీ జూలై 15
అన్నట్లు గానే ఆ సౌర తుఫాను బుధ‌వారం సాయంత్రం భూమిని చుట్టుముట్టి వెళ్లిపోయినట్లు తాజాగా అమెరికాకు చెందిన నేష‌న‌ల్ ఓషియానిక్ అండ్ అట్మాస్పియ‌రిక్ అడ్మినిస్ట్రేష‌న్ (ఎన్ఓఏఏ) వెల్ల‌డించింది. కొన్ని గంట‌ల పాటు ఈ సౌర గాలులు భూమిని చుట్టుముట్టిన‌ట్లు తెలిపింది. అయితే వీటి కార‌ణంగా గుర్తించ‌ద‌గిన మార్పులేమీ సంభ‌వించ‌లేదని స్ప‌ష్టం చేసింది. అయితే ఆ తుఫాను భూ అయాస్కాంత క్షేత్రంపై మాత్రం కాస్త ప్ర‌భావం చూపిన‌ట్లు ఈ అమెరిక‌న్ ఏజెన్సీ తెలిపింది.భార‌త కాల‌మానం ప్ర‌కారం బుధవారం రాత్రి 10.11 స‌మ‌యంలో ఈ సౌర తుఫాను భూమి మీదుగా వెళ్లిపోయిన‌ట్లు చెప్పింది. దీని జియోమాగ్నెటిక్ కే-ఇండెక్స్ 4గా ఉంది. కే-ఇండెక్స్ అనేది జియోమాగ్నెటిక్ తుఫానుల తీవ్ర‌త‌ను తెలిపే సూచిక‌. లెవ‌ల్ 4 సూచిస్తోందంటే ఇది స్వ‌ల్ప‌మైన ప్ర‌భావం చూపిన‌ట్లు అర్థం. ఈ సౌర తుఫాను కార‌ణంగా బ‌ల‌హీనమైన ప‌వ‌ర్ గ్రిడ్ ఫ్ల‌క్చువేష‌న్లు క‌నిపించాయ‌ని, ఇక కెన‌డా, అలాస్కాలాంటి ప్రాంతాల్లో అరోరాలు కూడా క‌నిపించిన‌ట్లు ఎన్ఓఏఏ వెల్ల‌డించింది.ఈ సౌర తుఫాను కంటికి క‌నిపించ‌క‌పోయినా, భూమిపై ఉన్న వారికి ఎలాంటి హాని క‌లిగించ‌క‌పోయినా.. దీని ద్వారా వ‌చ్చిన జియోమాగ్నెటిక్ వేవ్స్ మాత్రం ప‌వ‌ర్ గ్రిడ్ల‌ను ప‌ని చేయ‌కుండా చేయ‌గ‌ల‌వు. రేడియో క‌మ్యూనికేష‌న్లపై ప్ర‌భావం చూప‌గ‌ల‌వు. 2017లో ఇలాంటి సౌర తుఫానే రేడియో క‌మ్యూనికేష‌న్ల‌ను దెబ్బ‌తీశాయి. 2015లో ఈశాన్య అమెరికాలో జీపీఎస్ వ్య‌వ‌స్థ‌కు ఆటంకం క‌లిగించాయి. 1989లో అయితే కెన‌డాలోని క్యూబెక్ మీదుగా వెళ్లిన ఓ సౌర తుఫాను అక్క‌డి విద్యుత్ వ్య‌వ‌స్థ‌కు 9 గంట‌ల పాటు అంత‌రాయం క‌లిగించింది.

Related Posts