వాట్సాప్ మెసేజ్‌లను కోర్టులో ఆధారంగా పరిగణించలేము : సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ జూలై 15
వాట్సాప్ మెసేజ్‌లను కోర్టులో ఆధారంగా పరిగణించలేమని సుప్రీంకోర్టు ఓ తీర్పులో స్పష్టం చేసింది.. సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లో జరిగిన సంభాషణలకు సాక్ష్యం విలువ లేదని, అలాంటి వాట్సాప్ మెసేజ్‌లను కోర్టులో ఆధారంగా చూపరాదు అని కోర్టు తెలిపింది. చీఫ్ జస్టిస్ ఎన్ వీ రమణ, జస్టిస్ ఏఎస్ బొపన్నా, హృషికేశ్ రాయ్‌లతో కూడిన ధర్మాసనం ఓ కేసులో ఈ తీర్పు వెలువరించినట్లు తెలుస్తోంది. ఈ రోజుల్లో వాట్సాప్ మెసేజ్‌లకు ఎలాంటి ఆధారాలు ఉంటాయి.. ఏదైనా క్రియేట్ చేస్తున్నారు, ఆ తర్వాత వాటిని డిలీట్ చేస్తున్నారని, వ్యాపారవేత్తలు కుదుర్చుకుంటున్న ఒప్పందాల్లో ఇలాంటివి అసలే వీలుకాదు అని సుప్రీం చెప్పింది. అలాంటి వాట్సాప్ మెసేజ్‌లకు తాము విలువ ఇవ్వడం లేదని సుప్రీంకోర్టు న్యాయమూర్తి తెలిపారు. మరోవైపు వాట్సాప్ ప్రైవసీ పాలసీ విషయంలో ఆ సంస్థకు, కేంద్రానికి మధ్య వివాదం నెలకొన్న విషయం తెలిసిందే.