YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

సరిహద్దు వివాదానికి పరిష్కారం

సరిహద్దు వివాదానికి పరిష్కారం

సరిహద్దు వివాదానికి పరిష్కారం
న్యూఢిల్లీ, జూలై 15, 
సరిహద్దుల్లో నెలకున్న ప్రతిష్టంభను పరిష్కరించడానికి ప్రాధాన్యత ఇవ్వాలని భారత్, చైనా ఏకాభిప్రాయానికి వచ్చాయి.. ప్రస్తుత పరిస్థితిని పొడిగించడం ఇరు దేశాలకూ శ్రేయస్కరం కాదు’ అని కేంద్రం  ప్రకటనలో తెలియజేసింది. కొనసాగుతున్న సరిహద్దు వివాదం ఇరు దేశాల సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపుతోందని అని వ్యాఖ్యానించారు. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో భారత్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జయశంకర్ భేటీ తర్వాత ప్రభుత్వం ఈ ప్రకటన చేసింది.తజికిస్థాన్ వేదికగా షాంఘై కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్ విదేశాంగ మంత్రుల సమావేశానికి మంత్రి ఎస్ జయశంకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా భారత్, చైనా విదేశాంగ మంత్రుల భేటీ అయ్యారు. గంటపాటు జరిగిన ఈ సమావేశంలో వాస్తవాధీన రేఖ వెంబడి వివాదం సహా పలు ముఖ్యమైన అంశాలపై చర్చించారు. అంతేకాదు, ఇరు దేశాలకు చెందిన ఉన్నతస్థాయి సైనికాధికారుల భేటీకి కూడా అంగీకరించారు. మరోవైపు, ఎస్‌సీఓ సభ్య దేశాలు భద్రత, రక్షణ అంశాలపై చర్చించాయి.వాంగ్ యీతో భేటీ గురించి విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. ‘ఎస్‌సీఓ విదేశాంగ మంత్రుల సమావేశంలో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో గంటపాటు జరిగిన ద్వైపాక్షిక భేటీ ఫలవంతంగా సాగింది.. వాస్తవాధీన రేఖ వెంబడి పశ్చిమ సెక్టార్‌లో పలు ముఖ్యమైన అంశాల పరిష్కారమే లక్ష్యంగా చర్చలు సాగాయి’ అని పేర్కొన్నారు.యథాతథ స్థితి మార్పు ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశాం... సరిహద్దు ప్రాంతాలలో శాంతి, ప్రశాంతత పూర్తి పునరుద్ధరణ..నిర్వహణ ఇరు దేశాల సంబంధాల అభివృద్ధికి అవసరం.. సీనియర్ మిలిటరీ కమాండర్ల మధ్య సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి అంగీకరించారు’ అని తెలిపారు. కరోనా కారణంగా వాంగ్‌ యీకి వినూత్నంగా షేక్ హ్యాండ్ ఇస్తున్న ఫోటోను జయశంకర్ షేర్ చేశారు.గతేడాది సెప్టెంబరులో మాస్కోలో జరిగిన సమావేశాన్ని జయశంకర్ గుర్తుచేశారు. తూర్పు లడఖ్‌లోని ఎల్ఏసీ వెంట మిగతా సమస్యలను వీలైనంత తొందరగా పరిష్కరించి, బలగాల ఉపసంహరణకు సంబంధించి నాడు కుదిరిన ఒప్పందాన్ని అనుసరించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.ఈ ఏడాది ఆరంభంలో పాంగాంగ్ సరస్సు వద్ద విజయయవంతంగా సైన్యాలను ఉపసంహరించి.. సమస్యలను పరిష్కరించడానికి పరిస్థితులను సృష్టించిందన్నారు. ఈ లక్ష్యం కోసం భారత్‌తో చైనా కలిసి పనిచేస్తుందని ఊహిచినప్పటికీ, మిగతా ప్రాంతాల పరిస్థితి ఇంకా పరిష్కారం కాలేదని జైశంకర్ తెలిపినట్టు ప్రభుత్వం తన ప్రకటనలో తెలిపింది.

Related Posts