ప్రభుత్వ పాఠశాల పిల్లలకు 75 శాతం ప్రాధాన్యత ఇవ్వాలి
ముఖ్యమంత్రి కి లేఖ రాసిన ఎమ్మెల్సీ టీ. జీవన్ రెడ్డి
జగిత్యాల జులై 15
రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ ,బిసి, మైనార్టీ గురుకుల ఆశ్రమ పాఠశాలలో చేరిక పై ప్రభుత్వ పాఠశాల పిల్లలకు 75 శాతం ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతూ గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి లేఖ వ్రాశారు.రాష్ట్రంలో నిరుపేద వర్గాల పిల్లలు ప్రత్యేకించి దళితులు, బలహీన వర్గాలు మరియు మైనార్టీ ముస్లిం వర్గాల పిల్లలకు పాఠశాల స్థాయి విద్యలో ప్రాధాన్యత కల్పించడానికి గాను ఆంగ్ల మాధ్యమంలో బోధన చేపట్టబడే విధంగా గురుకుల ఆశ్రమ పాఠశాలలు (రెసిడెన్షియల్ స్కూల్స్) ఆశ్రమ పాఠశాలలో చేరికకు (అడ్మిషన్లకు) సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్య నియోజకవర్గ స్థాయిలో 50 శాతం స్థానిక రిజర్వేషన్ అమలు చేయవలేనని నిర్ణయించటం సంతోషం కరం మైన విషయం ఆని,ఈ రెసిడెన్షియల్ పాఠశాలలో ప్రస్తుతం అడ్మిషన్ ప్రక్రియ పిల్లలందరికీ కామన్ గా ప్రవేశ పరీక్షల ద్వారా మెరిట్ నిర్ధారణ చేసి అడ్మిషన్ చేపట్టడం జరుగుతుందని , వాస్తవంగా ప్రస్తుతం అమలులో ఉన్నటువంటి విద్యావిధానంలో దళిత ,బలహీన వర్గాలకు సంబంధించి మరియు మైనార్టీ కానీ లేక ఇతర సామాజిక వెనుకబాటుతరానికి గురైనటువంటి పిల్లలకు కానీ వారి కుటుంబాలలో ఆర్థిక స్తోమత ఉన్నటువంటి వారి పిల్లలను ప్రైవేట్ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమంలో బోధనా సౌకర్యం కల్పించటం జరుగుతున్నది, ఆర్థికంగా సౌకర్యం లేనటువంటి నిరుపేద వర్గాల పిల్లలకు మాత్రమే ప్రభుత్వ పాఠశాలలో బోధన సదుపాయాలు పొందటం జరుగుతున్నది, ఈ పరిస్థితులలో ప్రైవేటు పాఠశాలలో ఆంగ్ల మాధ్యమంలో బోధన సదుపాయం పొందినటువంటి పిల్లలతో ప్రభుత్వ పాఠశాలలో భోదన సదుపాయం పొందినటువంటి పిల్లలు పోటీ పరీక్షలలో నెగ్గటంలో ఉన్నటువంటి ఇబ్బందులు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న గురుకుల ఆశ్రమ పాఠశాలలో 75 శాతం వరకే చేరిక ప్రైవేటు పాఠశాలల నుండి వచ్చే పిల్లలు మాత్రమే పొందటం గమనార్హం ఇట్టి పరిస్థితులలో సామాజిక వెనుకబాటు తనంతో పాటు ఆర్థికంగా కూడా వెనుకబాటు తనానికి గురవుతున్నటువంటి దళితులు, బలహీన ,వర్గాల పిల్లలు వారి ప్రాథమిక విద్య ప్రభుత్వ పాఠశాలలకు పరిమితం కావడంతో అదే సామాజిక వెసులుబాటు తనం కలిగి ఉన్నప్పటికీ వారికి ఉన్నటువంటి ఆర్థిక వెసులుబాటుతో ప్రైవేటు పాఠశాలలో బోధనా సౌకర్యం పొందుతున్నటువంటి పిల్లలతో ఎంట్రెన్స్ పరీక్షలలో పోటీ పడి అడ్మిషన్ పొందటంలో ఇబ్బందులు ఎదురవుతున్న దృష్ట్యా ఏ విధంగా అయితే బాసర సాంకేతిక విద్య కళాశాలలో గ్రామీణ ప్రాంత పాఠశాల విద్యార్థులకు ప్రాధాన్యత కల్పించే విధంగా అడ్మిషన్ ప్రక్రియ చేపట్టడం జరుగుతుందో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఎస్సీ ,ఎస్టీ ,బీసీ, మైనార్టీ గురుకుల ఆశ్రమ పాఠశాలలో చేరికలు స్థానిక రిజర్వేషన్ తో పాటు ప్రభుత్వ పాఠశాలల నుండి వచ్చే పిల్లల చేరికలో కూడా ప్రాధాన్యత కల్పించేలా ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు ప్రత్యేకంగా ప్రతి ఎస్సీ ,ఎస్టీ, బిసి ,మరియు మైనార్టీ గురుకుల ఆశ్రమ పాఠశాలలో 75 శాతం రిజర్వేషన్ చేయగలిగినచో నిరుపేద వర్గాల్లోని దళిత బలహీన వర్గాల మరియు మైనార్టీ పిల్లలకు ప్రోత్సాహం కలిగించటంతో పాటు ప్రభుత్వ పాఠశాలలు కూడా బలోపేతం చేయడానికి తోడ్పడుతుందని ముఖ్యమంత్రి కి ఎమ్మెల్సీ వ్రాసిన లేఖలో పేర్కొన్నారు.