YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి తెలంగాణ

డిప్లొమా కోర్సు లో ప్రవేశం కొరకు దరఖాస్తు ల స్వీకరణ  సిఐపిఇటి డైరెక్టర్ శ్రీనివాసులు

డిప్లొమా కోర్సు లో ప్రవేశం కొరకు దరఖాస్తు ల స్వీకరణ  సిఐపిఇటి డైరెక్టర్ శ్రీనివాసులు

డిప్లొమా కోర్సు లో ప్రవేశం కొరకు దరఖాస్తు ల స్వీకరణ
 సిఐపిఇటి డైరెక్టర్ శ్రీనివాసులు
హైదరాబాద్
విద్య అర్హతను బట్టి డిప్లొమా కోర్సులలో ప్రవేశం కొరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రో కెమికల్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ డైరెక్టర్ శ్రీనివాసులు తెలిపారు. ఈ మేరకు గురువారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన చీఫ్ మేనేజర్ ఎకే రావు తో కలిసి మాట్లాడారు.. తమ సంస్థ  హైదరాబాద్ నగరంలో 1981 వ సంవత్సరంలో స్థాపించామని అన్నారు.   ఈ సంస్థలో చదువుకున్న 80 శాతం మంది విద్యార్థులు దేశ ,విదేశాలలో ఉన్నతమైన స్థాయిలో పదవులు నిర్వహిస్తున్నారు అని తెలిపారు.   ప్లాస్టిక్ టెక్నాలజీ లో డిప్లమా(డి పి టి) చేయాలనుకునేవారికి మూడు సంవత్సరాల వ్యవధి , ప్లాస్టిక్ మౌల్డ్ టెక్నాలజీ(డిపిఎంటి)లో డిప్లమా చేయాలంటే వారికి రెండు సంవత్సరాల కాలవ్యవధి, ప్లాస్టిక్ ప్రాసెసింగ్ అండ్ టెస్టింగ్ లో పోస్ట్ గ్రాడ్యూవెట్ డిప్లమా( పి జి డి- పిపిటి) చేయాలనుకునేవారు ఒకటిన్నర సంవత్సరాల కాల వ్యవధి ఉంటుందని తెలిపారు.  డి పి టి, డిపిఎంటి కోర్సులకు పదవ తరగతి,  పి జి డి- పిపిటి కోర్సులకు బీఎస్సీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు అని అన్నారు. ఈ దరఖాస్తులు ఈనెల 25వ తారీకు లోపు www.cipet.onlineregistrationform.org/CIPET/  వెబ్ సైట్లు ద్వారా పంపించాలని కోరారు మిగతా వివరాల కోసం 8374064444 నెంబర్ను సంప్రదించవలసినదిగా కోరారు. ఈ కార్యక్రమంలో  ట్రైనింగ్ ఇన్ ఛార్జ్ రాధాకృష్ణ, ట్రైనింగ్ అసిస్టెంట్ ఆఫీసర్ జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Related Posts