YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

యాంటీ మోడీ స్టాండ్ తప్పదా

యాంటీ మోడీ స్టాండ్ తప్పదా

విశాఖపట్టణం, జూలై 16,
వైఎస్ జగన్ మోడీ ఏదన్నా ఓయస్ అంటారని విపక్షాలు దెప్పుతూంటాయి. జగన్ ఏపీలోనే గట్టిగా మాట్లాడుతారని, ఢిల్లీ వెళ్తే వంగి నమస్కారాలు పెడతారని తరచూ చంద్రబాబు విమర్శలు చేస్తున్న సంగతి విదితమే. అయితే వీరంతా ఆశ్చర్యపోయే సన్నివేశాలు ఈసారి పార్లమెంట్ రైనీ సెషన్ సందర్భంగా నమోదు అవుతాయని అంటున్నారు. ఒక విధంగా చెప్పాలంటే గెలిచిన తరువాత వైసీపీ ఎంపీలకు అతి పెద్ద పని ఢిల్లీలో పడబోతోంది అంటున్నారు. స్పీకర్ పోడియం దగ్గరకు వెళ్ళి నానా యాగీ చేసేందుకు వారంతా ప్రిపేర్ కావాల్సిందేంట. మోడీ మీద జగన్ కి కోపాలు అలా పెరిగి ఎవరెస్ట్ శిఖరాన్ని తాకుతున్నాయి. ఎందుకిలా జగన్ అయ్యారు అంటే దానికి మోడీ నిర్లక్ష్య వైఖరే కారణమట. ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్ పరం చేయవద్దు అంటూ రెండుసార్లు లేఖలు రాస్తే ఇప్పటిదాకా స్పందన లేదు. ఇక తెలంగాణా ఏపీకి రావాల్సిన నీటిని అడ్డగోలుగా దోచుకుంటోందని లేఖలు రాసినా కూడా బీజేపీ పాలకులు కిమ్మనలేదు. మరో వైపు రెబెల్ ఎంపీ రఘురామరాజు మీద ఏడాది క్రితమే ఫిర్యాదు చేసినా ఈ రోజుకు కూడా ఏ రకమైన చర్యలు లేవు. కరోనా వేళ ఏపీకి ఏ మాత్రం ఆర్ధిక సాయం లేదు. పైగా రుణ పరిమితులు పెట్టి కాళ్ళను కట్టేస్తున్నారు. దాంతో జగన్ గట్టిగా పార్లమెంట్ లో తగులుకోమని ఎంపీలకు చెబుతున్నారుట.సడెన్ గా విశాఖ ఉక్కు కర్మాగారం విషయంలో వైసీపీ స్టాండ్ తీసుకుంది. ఇప్పటిదాకా అనేక కారణాలు మోడీ సర్కార్ మీద అసంతృప్తిని రాజేశాయి. అయితే వాటిలో కొన్ని వ్యక్తిగతం. మరికొన్ని పాలనాపరమైనవి. అందువల్ల అంద‌రికీ కనెక్ట్ అయ్యేలా విశాఖ స్టీల్ ప్లాంట్ ఇష్యూని టేకప్ చేసి దూసుకుపోతే కచ్చితంగా ఏపీ జనాల నుంచి మద్దతు ఉంటుంది. అదే టైమ్ లో బీజేపీ కూడా బదనాం అవుతుంది అన్నదే వైసీపీ లెక్కట. అందుకే వచ్చే నెలలో ఢిల్లీలో జరిగే ఆందోళనలో వైసీపీ ఉక్కు కార్మికులతో ప్రత్యక్షంగా పాలు పంచుకుంటుందని విజయసాయిరెడ్డి గట్టిగానే చెప్పేశారు.వైసీపీకి బీజేపీ అవసరాలు ఉన్నాయనే ఇంతదాకా అంతా అంటున్నారు. అయితే బీజేపీకి వైసీపీ అవసరం కూడా ఉందని తెలియచేయడానికే ఇలా జగన్ చేయడానికి సిద్ధపడుతున్నారని అంటున్నారు. రాజ్యసభలో వైసీపీ మద్దతు ఇక మీదట మరింత కీలకం అవుతుంది. అలాగే వచ్చే ఏడాది రాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ ఓట్లు చాలా ముఖ్యం. బీజేపీ క్యాండిడేట్ నెగ్గాలి కంటే జగన్ దగ్గరకే రావాలి. ఈ రకమైన లెక్కలు చాలానే ఉన్నాయి కాబట్టే వ్యూహాత్మకంగా పట్టు బిగించాలని జగన్ నిర్ణయించుకున్నారు అంటున్నారు. మరి అక్కడ ఉన్నది మోడీ షా. జగన్ గుస్సాను వారు సీరియస్ గా తీసుకుంటారా. లేక లైట్ గా పక్కన పెడతారా చూడాలి.

Related Posts