YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం దేశీయం విదేశీయం

ఇక స్పేస్ టూరిజం పరుగులు

ఇక స్పేస్ టూరిజం పరుగులు

న్యూయార్క్, జూలై 16, 
కమర్షియల్ గా తొలి అంతరిక్ష యాత్ర విజయవంతం కావడంతో  వర్జిన్ గెలాక్టిక్ అధిపతి, బ్రిటీష్ బిలియనీర్ రిచర్డ్ బ్రాన్సన్ మరో సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. స్పేస్ ఇన్వెస్ట్ మెంట్ ట్రస్ట్ లో భారీ పెట్టుబడులకు శ్రీకారం చుట్టి ప్రపంచ వ్యాప్తంగా మరోసారి హాట్ టాపిక్ కు కేంద్రం అయ్యారు. లండన్ కు చెందిన సెరాఫిమ్ స్పేస్ టెక్ సంస్థలో విలువైన వాటా కొనుగోలు చేసినట్లు సెరాఫిమ్ ప్రకటించింది.
ఇండియన్ అమెరికన్ ఆస్ట్రోనాట్ శిరీష బండ్ల తొలి స్పేస్ టూర్ లో ఛాన్స్ దక్కించుకుని ఆదివారం వర్జిన్ గెలాక్టిక్ స్పేస్ ప్లేన్లో అంతరిక్షానికి వెళ్లి వచ్చిన విషయం తెలిసిందే. స్పేస్ ప్లేన్లో అంతరిక్ష యాత్ర చేయాలనుకునేవాళ్లకు టికెట్ ధరను రూ. 1.86 కోట్లుగా నిర్ణయించినా ఆమె ఆ డబ్బు చెల్లించి యాత్ర విజయవంతంగా చేసి వచ్చింది.అంతరిక్ష యాత్రకు వెళ్లి వచ్చిన వారు తమ అనుభూతిని వివరిస్తూ ‘‘ఇంకా నేను అక్కడ ఉన్నట్లే ఉంది. కానీ ఇక్కడికి రావడంకూడా సంతోషమే. అంతరిక్షానికి వెళ్లి రావడం గురించి చెప్పాలంటే.. అద్భుతం అనే మాట కన్నా ఇంకా పెద్ద పదంకోసం వెతుకుతున్నా. పై నుంచి భూమిని చూడటం అనేది ఒక లైఫ్ చేంజింగ్ ఎక్స్ పీరియెన్స్” అని ఆనందం వ్యక్తంచేశారు. చిన్నప్పటి నుంచే స్పేస్కు వెళ్లాలన్న కలలు ఇప్పుడు నిజమయ్యాయని గుర్తుచేసుకున్న ఇంటర్వ్యూలు ప్రపంచ వ్యాప్తంగా ట్రెండింగ్ లో నిలిచాయి. ఈ నేపధ్యంలో బ్రిటీష్ సంపన్నుడు బ్రాన్సన్ అంతరిక్ష యాత్ర విజయవంతం అయిన కొన్ని గంటల వ్యవధిలోనే కీలక నిర్ణయం ఆచరణలో పెట్టేశారు. ఎంత మేరకు పెట్టుబడులు పెట్టింది సెరాఫిమ్ వెల్లడించనప్పటికీ 178 మిలియన్ పౌండ్లు పెట్టుబడులు పెట్టి వాటాలు కొనుగోలు చేసినట్లు వాణిజ్యవర్గాల కథనం. సెరాఫిమ్ త్వరలో లండన్ స్టాక్ ఎక్చేంజిలో ట్రేడింగ్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేసుకుంటున్న తరుణంలో సెరాఫిమ్ ఐపీఓలో భారీ పెట్టుబడులు పెట్టడం సంచలనం సృష్టించింది. రాబోయే రోజుల్లో అంతరిక్ష యాత్రను సామాన్యులకు చేరువ చేసే రీతిలో ప్రయోగాలు చేయాలన్న రిచర్డ్ బ్రాన్సన్ వ్యాఖ్యల నేపధ్యంలో ఆయన ఈ రంగంలో భారీ పెట్టుబడులతో అంతరిక్ష యాత్రల ప్రయోగాలకు మరింత ఊపు తీసుకొచ్చారు.

Related Posts