YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కరీంనగర్ లో కేటీఆర్ వర్సెస్ ఈటెల

కరీంనగర్ లో కేటీఆర్ వర్సెస్ ఈటెల

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇద్దరు మంత్రుల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. సీఎం కేసీఆర్ తనయుడు, మంత్రి కేటీఆర్, మంత్రి ఈటల రాజేందర్‌ పైకి కలిసి ఉన్నట్టే కనిపిస్తున్నా.. లోలోపల మాత్రం ఇద్దరు కూడా ఆధిపత్యం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. హుజురాబాద్ నియోజకవర్గం నుంచి ఈటెల ప్రాతినిధ్యం వహిస్తుండగా.. సిరిసిల్ల నియోజకవర్గం నుంచి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ ఒకరి నియోజకవర్గంలో మరొకరు పర్యటించకపోవడమే వారిమధ్య సంబంధాలకు నిదర్శనం. కొద్ది రోజులుగా పాత క‌రీంన‌గ‌ర్ జిల్లాపై పూర్తి ఆధిప‌త్యం కోసం కేటీఆర్ ప్ర‌య‌త్నాలు చేయ‌డం…. సీఎం కొడుకు, ఫ్యూచ‌ర్ పార్టీ అధినేత‌గా ఇప్ప‌టికే గుర్తింపు రావ‌డంతో జిల్లా అధికారులు, ఇత‌ర ఎమ్మెల్యేలు రాజేంద‌ర్‌ను ప‌క్క‌న పెట్టి కేటీఆర్ మాట‌నే ఫాలో అవుతున్నారు.అలాగే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అధికారులు మంత్రి కేటీఆర్, ఎంపీ మాట తప్ప మంత్రి ఈటల మాట వినకపోవడంతో ఆయన చివ‌ర‌కు త‌న‌కు ఈ మంత్రి ప‌ద‌వి ఎందుకుని కూడా స‌న్నిహితుల వ‌ద్ద వాపోతున్న‌ట్టు కూడా టాక్ బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. ఇక ఈట‌ల ఆర్థిక‌శాఖ‌కు మంత్రిగా ఉన్న ఈ శాఖ‌లో కీల‌క నిర్ణ‌యాలు కేసీఆర్ చెప్పిన‌ట్టే జ‌రుగుతాయ‌న్న‌ది తెలిసిందే. అంటే ఈ లెక్క‌న ఈట‌ల‌కు అటు త‌న శాఖ‌లో స‌చివాల‌య‌ప‌రంగానూ, ఇక్క‌డ జిల్లాలోనూ ఏ మాత్రం ప్రాధాన్యం లేద‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఆయ‌న తెలంగాణ‌లో కీల‌క మైన ఆర్థిక‌శాఖా మంత్రిగా ఉండి ఇటు జిల్లాలో ఎంపీ కవిత, అటు మంత్రి కేటీఆర్ పెత్తనంతో ఈటలకేవలం తన నియోజకవర్గానికే పరిమితం అవుతున్నారని ఆ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే జిల్లా పరిషత్ సమావేశాలు తరుచూ వాయిదా పడుతున్నాయనీ, అనేక అంశాల్లో ఇద్దరు మంత్రుల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదనీ అటు అధికారులు, ఇటు నాయకులు అనుకుంటున్నారు.పార్టీ పుట్టిన‌ప్ప‌టి నుంచి కేసీఆర్ వెన్నంటే ఉండ‌డంతో పాటు ఓ సీనియ‌ర్ మంత్రిగా ఉన్న త‌న‌కు ఇలాంటి అవ‌మానం ఏంట‌ని ? ఈట‌ల ఫైర్ అవుతున్నారు. ఇక జిల్లాలోని జ‌గిత్యాల‌, కోరుట్ల నియోజ‌క‌వ‌ర్గాలు నిజామాబాద్ ఎంపీ ప‌రిధిలో ఉండ‌డంతో కేసీఆర్ త‌న‌య క‌విత కూడా జిల్లాలో బాగా జోక్యం చేసేసుకుంటున్నారు. దీంతో అటు క‌విత‌, ఇటు కేటీఆర్ దెబ్బ‌తో ఈట‌ల అస‌లు మంత్రిగా ఉన్నారా ? అన్న డౌట్లు కూడా చాలా మందికి క‌లుగుతున్నాయి. ఎవ‌రికి అయినా బిగ్ షాట్ల‌కు, ఇత‌ర ఎమ్మెల్యేల‌కు జిల్లాలో ప‌ని కావాలిస్తే వాళ్లు క‌విత‌నో, కేటీఆర్‌నో మాత్ర‌మే క‌లుస్తున్నారు.. కేవలం ఉమ్మడి జిల్లా సమావేశాల్లోనే ఇద్దరు మంత్రులు పాల్గొంటున్నారనీ, సిరిసిల్లలో ఈటలగానీ, హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలో కేటీఆర్ గానీ పర్యటించింది లేదనే టాక్ వినిపిస్తోంది. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఈటెల రాజేందర్ కీలక పాత్ర పోషించారు. కేసీఆర్ కు అండగా ఉన్నారు. కానీ, రాష్ట్ర ఏర్పాటు చేసిన తర్వాత, టీఆర్ఎస్ అధికారంలోకి రావడం.. ఈటెల రాజేందర్ ఆర్థిక శాఖ మంత్రి గా బాధ్యతలు చేపట్టడం చకచకా జరిగిపోయాయి. మంత్రిగా కీలక పదవి దక్కినా ఈటెల లోలోపల మాత్రం ఎందుకో అసంతృప్తి గా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. పేరుకే మంత్రి గానీ జిల్లాలో తనకు ప్రాధాన్యం లేదని మదనపడుతున్నట్లు తెలుస్తోంది. జిల్లా పెత్త‌నం కేసీఆర్ కొడుకు, కూతురు పంచుకుంటుండ‌డంతో మంత్రి గుర్రుగా ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. ఇదేసమయంలో మంత్రి కేటీఆర్ కూడా ఈటెల ప్రాతినిధ్యం వహిస్తున్న హుజురాబాద్ నియోజకవర్గంలో జోక్యం చేసుకోవడం లేదని పలువురు నాయకులు అంటున్నారు. ఇదిలా ఉండగా.. నిజామాబాద్ ఎంపీ కవిత పరిధిలో ఉన్న జగిత్యాల నియోజకవర్గంలో ఆమె అనుమతి లేనిదే ఏ మంత్రి కూడా రావొద్దని గట్టిగా చెప్పినట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో ఆమె ఈ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Related Posts