YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

వైసీపీ వైపు విష్ణుకుమార్ రాజు అడుగులు

వైసీపీ వైపు విష్ణుకుమార్ రాజు అడుగులు

బీజేపీ ఎమ్మెల్యే, సీనియ‌ర్ నేత విష్ణుకుమార్ రాజు ఎప్పుడు మైకు ముందుకు వ‌చ్చినా రెండు సంచ‌ల‌నాలు.. రెండు వివాదాల‌తోనే త‌న ప్రసంగాన్ని ముగిస్తారు. గ‌తంలో అంటే బీజేపీతో టీడీపీ తెగ‌తెంపులు చేసుకోక ముందు ఆయ‌న అచ్చం టీడీపీ ఎమ్మెల్యేగానే వ్యవ‌హ‌రించారు. నాలా ప‌న్ను విష‌యంలో సాక్షాత్తూ.. గ‌వ‌ర్నర్ న‌ర‌సింహ‌న్‌నే ఆయ‌న టార్గెట్ చేసుకున్నాడు. ఆ త‌ర్వాత అడ‌పా ద‌డ‌పా.. చంద్రబాబును పొగుడుతూనే ఉన్నాడు. అయితే, ఇప్పుడు రాజ‌కీయం రివ‌ర్స్ అయిన నేప‌థ్యంలో రాజు గారి మాట‌లు కూడా ఏగూటి చిల‌క .. అన్నట్టుగానే ఉంది. తాజాగా ఆయ‌న ఏపీ రాజ‌కీయాల గురించి మాట్లాడుతూ.. చాలా ఆస‌క్తిక‌ర, వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఇటీవ‌ల కాలంలో టీడీపీ అధినేత చంద్రబాబు స‌హా ఆ పార్టీ నేత‌లు జ‌గ‌న్‌-బీజేపీ బంధంపై చేస్తున్న వ్యాఖ్యల‌ను బ‌ల‌ప‌రిచేలా ఉంది.దీనివెనుక పెద్ద వ్యూహ‌మే ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు . వాస్తవానికి విష్ణు వైసీపీలో చేర‌తార‌ని ఇటీవ‌ల వ‌ర‌కు క‌థ‌నాలు వ‌చ్చాయి. కానీ, ఇప్పుడు ఆయ‌న జ‌గ‌న్‌ను మెచ్చుకొంటూ చేసిన వ్యాఖ్యల‌ను బ‌ట్టి బీజేపీ మొత్తంగా జ‌గ‌న్‌తో బీజేపీ పొత్తుకు రెడీ అవుతున్నద‌నే వ్యాఖ్యల‌ను నిజం చేస్తున్నాయ‌ని అంటున్నారు. జ‌గ‌న్ పాద‌యాత్ర విశాఖ‌కు వ‌చ్చిన‌ప్పుడు తాను జ‌గ‌న్‌ను క‌లుస్తాన‌ని కూడా ఓపెన్‌గానే చెప్పారు. మొత్తంగా ఈ వ్యాఖ్యలు టీడీపీ నేత‌ల‌కు మంచి స‌బ్జెక్టును అందించిన‌ట్టేన‌ని అంటున్నారు. ఇక‌, టీడీపీ నేత‌లు ఎలా రెచ్చిపోతారో చూడాలి. ఏదేమైనా రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో చెప్పలేమ‌న‌డానికి ఇదొక నిద‌ర్శనం.రాష్ట్ర రాజ‌కీయాల‌పై త‌న దైన శైలిలో స్పందించారు విష్ణుకుమార్ రాజు. ఈ క్రమంలోనే ఆయ‌న మాట్లాడుతూ.. ఏపీలో అధికార పార్టీ హ‌వా అయిపోయింద‌ని అన్నారు. నేత‌లు ఎక్కడిక‌క్కడ అవినీతి పాల్పడుతున్నార‌ని చెప్పారు. చంద్రబాబు గ్రాఫ్ ప‌డిపోయింద‌ని చెప్పారు. అదే స‌మ‌యంలో జ‌గ‌న్ గ్రాఫ్ రివ్వున దూసుకుపోతోంద‌ని అన్నా రు. అంతేకాదు.. 2014 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేశాయ‌ని, కానీ, వైసీపీ మాత్రం ఒంట‌రిగా పోటీ చేసింద‌ని అన్నారు. అప్పట్లో ఈ కూట‌మికి.. వైసీపీ కంటే కేవ‌లం 5 లక్షల ఓట్లు మాత్రమే ఎక్కువగా వచ్చాయని… 2019 ఎన్నికల్లో టీడీపీ ఒంటరిగా పోటీ చేస్తే ఓటమి ఖాయమని అన్నారు. ఏపీలో చంద్రబాబు చేస్తున్నది అధర్మ పోరాటమన్న ఆయన… కర్ణాటకలో బీజేపీని ఓడించేందుకు కుటిల ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు.పట్టిసీమ ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై పదిహేను రోజుల్లో సీబీఐ విచారణ కోరతామని విష్ణు కుమార్ రాజు చెప్పారు. పొత్తులపై బీజేపీ ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. అయితే, విష్ణు వ్యాఖ్యల‌పై స‌ర్వత్రా విస్మయం వ్యక్తమ‌వుతోంది. 

Related Posts