YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

తక్కువ నీటి తో అధిక దిగుబడులు సాధించేందుకు డ్రిప్ సౌకర్యం ఎంతో ఉపయోగం

తక్కువ నీటి తో అధిక దిగుబడులు సాధించేందుకు డ్రిప్ సౌకర్యం ఎంతో ఉపయోగం

అనంతపురం
వర్షాభావం ఉన్న అనంతపురం జిల్లాలో కరువు ఎదుర్కొనేందుకు వ్యవసాయంలో తక్కువ నీటి లభ్యత తో అధిక దిగుబడులు సాధించేందుకు డ్రిప్ వ్యవస్థ ఎంతో ఉపయోగమని వక్తలు పేర్కొన్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో డ్రిప్ పరికరాల తయారీ కర్మాగారాన్ని ముస్లిం మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలతో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం నాయకుడు షేక్షావలి అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా మార్కెట్ కమిటీ చైర్మెన్ భర్త బిక్కీ హరి,  బంజారా జిల్లా నాయకుడు మహేష్ , మాజీ మున్సిపల్ చైర్మన్ వై పి రమేష్ , మాజీ వైస్ ఎంపీపీ గోళ్ల వెంకటేశులు, అగ్నిమాపక దళ అధికారి నజీర్ అహ్మద్, విద్యుత్ శాఖ అధికారి చాంద్ భాషా, సీనియర్ జర్నలిస్ట్ వార్త ప్రసాద్ తదితరులు ప్రసంగిస్తూ అనంతపురం జిల్లా పేరు చెప్పగానే అందరికీ కరువు గుర్తుకు వస్తుందని, వ్యవసాయంలో తక్కువ నీటితో, తక్కువ వ్యయంతో ఎక్కువ దిగుబడులు సాధించేందుకు డ్రిప్ సిస్టం ఎంతో ఉపయోగమని అన్నారు. జిల్లాలో మారుమూల ప్రాంతమైన కళ్యాణదుర్గంలో డ్రిప్ పరికరాల తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేసి రైతులకు బాసటగా నిలవడం అభినందనీయమనిపేర్కొన్నారు .నియోజకవర్గ వ్యాప్తంగా రైతులందరికీ తక్కువ ధరతోనే డ్రిప్ పరికరాలు అందించేందుకు పారిశ్రామికవేత్తలు శర్మస్ వలి బృందం కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.

Related Posts