YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

క‌న్వ‌ర్ యాత్ర‌ను ర‌ద్దు చేయండి

క‌న్వ‌ర్ యాత్ర‌ను ర‌ద్దు చేయండి

న్యూఢిల్లీ జూలై 16
క‌న్వ‌ర్ యాత్ర‌ను ర‌ద్దు చేయాల‌ని సుప్రీంకోర్టు ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వాన్నిఆదేశించింది. ప్ర‌జ‌ల ఆరోగ్యం, జీవించే హ‌క్కు అత్యున్న‌త‌మైన‌వ‌ని సుప్రీంకోర్టు పేర్కొన్న‌ది.. కరోనా థర్డ్ వే నేపద్యం లో సుమోటోగా కేసును స్వీక‌రించిన సుప్రీం.. త‌న ఆదేశాల‌ను జారీ చేసింది. మ‌త‌పర‌మైన‌వాటితో క‌లిపి అన్ని ర‌కాల భావోద్వేగాలు ప్రాథ‌మిక హ‌క్కు క‌న్నా త‌క్కువే అని ఆర్ఎఫ్ నారీమ‌న్ నేతృత్వంలోని సుప్రీం బెంచ్ తీర్మానించింది. ఈ కేసును మ‌ళ్లీ సోమ‌వారం విచారించ‌నున్న‌ట్లు సుప్రీంకోర్టు తెలిపింది. క‌న్వ‌ర్ యాత్ర నిర్వ‌హ‌ణ‌ను ఉత్త‌రాఖండ్ ప్ర‌భుత్వం ర‌ద్దు చేయ‌గా.. యూపీ ప్ర‌భుత్వం ఆ యాత్రకు ప‌చ్చ‌జెండా ఊపింది. ఈ నేప‌థ్యంలో కోర్టు జోక్యం చేసుకుని, కోవిడ్ వేళ ఆ వేడుక‌ల‌ను ర‌ద్దు చేయాల‌ని యూపీని ఆదేశించింది. ఒక‌వేళ త‌మ నిర్ణ‌యాల‌ను ధిక్క‌రిస్తే, అప్పుడు క‌ఠిన‌మైన ఆదేశాలు జారీ చేస్తామ‌ని యూపీ ప్ర‌భుత్వాన్ని కోర్టు హెచ్చ‌రించింది. ఆర్టిక‌ల్ 21 ప్ర‌కారం సుమోటోగా కేసును స్వీక‌రించామ‌ని కోర్టు తెలిపింది

Related Posts