YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

అక్రమ అరెస్ట్ ల తో ప్రజా పోరాటాలను ఆపలేరు

అక్రమ అరెస్ట్ ల తో ప్రజా పోరాటాలను ఆపలేరు

ములుగు జులై 16
టిపిసిసి పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆదేశాల మేరకు చలో రాజ్ భవన్ కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకులను  వెళ్లకుండా శుక్రవారం రోజున  ములుగు జిల్లా వ్యాప్తంగా ఎక్కడికి అక్కడ ముందస్తు అరెస్టులు చేసిన పోలీసులు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి  మాట్లాడుతూ  గత కాంగ్రెస్ హయాంలో పెట్రోల్ 54 రూపాయలు గ్యాస్ 410 ఉంటే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నీసిగ్గుగా పెట్రోల్ 105 గ్యాస్ 1000 కి పైగా పేదల పైన మోపిన నరేంద్ర మోడీ కి కెసిఆర్ కు  ప్రజలే గుణ పాఠం చెప్పటం కాయం అని అక్రమ అరెస్ట్ లతో ప్రజా పోరాటాలను ఆపలేరని ప్రజల పక్షాన నిలబడి కాంగ్రెస్ పార్టీ పోరాటాలు చేస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్ల పెల్లి రాజేందర్ గౌడ్ మండల అధ్యక్షులు ఎండీ చాంద్ పాషా,జిల్లా నాయకులు  కుమార్ గౌడ్,యూత్ కాంగ్రెస్ నియోజక వర్గ అధికార ప్రతినిధి వంశీ కృష్ణ,యూత్ కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి తారక్,నాయకులు అజ్మీరా శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు

Related Posts