YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

 రాజన్న రాజ్యం తేవడమే లక్ష్యం

 రాజన్న రాజ్యం తేవడమే లక్ష్యం

 రాజన్న రాజ్యం తేవడమే లక్ష్యం
అన్న పై  అలిగితే మాట్లాడటం మానేస్తారు..కానీ పార్టీ పెడతారా..?.
వైఎస్ జగన్.. నేను రెండు ప్రాంతాలకు ప్రాతినిథ్యం వహిస్తున్నాం.
మా పరిధులకు మేం కట్టుబడి ఉన్నాం’
రాజన్న రాజ్యం రాకుంటే తెలంగాణ ప్రజలే తిరగబడతారు..
స్పష్టం చేసిన వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల
హైదరాబాద్ జూలై 16
రాజన్న రాజ్యం తేవడమే లక్ష్యమని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల తెలిపారు. తెలంగాణ ప్రజలకు న్యాయం చేయాలనే పార్టీని స్థాపించామని వైఎస్‌ షర్మిల అన్నారు. వైఎస్సార్ తెలంగాణ పార్టీ పేరుతో కొత్త పార్టీని ఏర్పాటు చేసిన తర్వాత ఆమె తొలిసారి  శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇప్పటి వరకూ వచ్చిన ప్రశ్నలు, జనాల్లో నెలకొన్న అనుమానాలన్నింటినీ చెక్ పెట్టేశారు. ‘ఏపీలో రాజన్న రాజ్యం వస్తున్నట్లే కనిపిస్తోందన్నారు.తెలంగాణా లో  ఒక వేళ రాజన్న రాజ్యం రాకుంటే తెలంగాణ ప్రజలే తిరగబడతారు.. అందులో ఎలాంటి సందేహం అక్కర్లేదు. వైఎస్ జగన్.. నేను రెండు ప్రాంతాలకు ప్రాతినిథ్యం వహిస్తున్నాం. మా పరిధులకు మేం కట్టుబడి ఉన్నాం’ అని వైఎస్ షర్మిల చెప్పుకొచ్చారు. ‘ ఏపీ సీఎం జగన్‌పై నేను అలిగి పార్టీ పెట్టానని కొందరు అంటున్నారు. ఆ మాట అనడం సరికాదు. అలిగితే మాట్లాడటం మానేస్తారు కానీ పార్టీ పెడతారా..?. తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతోంది.. వారికి న్యాయం చేయాలనే పార్టీని స్థాపించాం. వైఎస్సార్‌టీపీ నాకోసం పెట్టిన పార్టీ కాదు. తెలంగాణలో పార్టీ పెట్టాల్సిన అవసరం ఉంది అందుకే.. స్థాపించాం. కాంగ్రెస్‌ అమ్ముడుపోయిన పార్టీ.. టీఆర్‌ఎస్‌, బీజేపీ కుమ్మక్కు అయ్యాయి. హుజురాబాద్‌ ఉప ఎన్నికకు అర్ధమే లేదు. చేవెళ్ల నుంచి పాదయాత్ర ప్రారంభిస్తా’ అని షర్మిల చెప్పుకొచ్చారు.వైఎస్ షర్మిల తెలంగాణ రాజకీయాల్లోకి వస్తున్నారనే వార్తలు వచ్చినప్పట్నుంచి ఇప్పటి వరకూ అసలు ఆమె ఎందుకు పార్టీ పెడుతున్నారు..? ఎవరి కోసం పార్టీ పెడుతున్నారు..? ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తన సోదరుడిపై అలిగారా..? ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయా..? అందుకే ఆమె పార్టీ పెట్టాల్సి వచ్చిందా..? ఇలా చెప్పుకుంటే పోతే అటు ఏపీ ప్రతిపక్ష పార్టీకి చెందిన నేతలు.. ఇటు తెలంగాణ నేతలు, మంత్రుల నుంచి పెద్ద ఎత్తునే విమర్శలు, ప్రశ్నలే వచ్చాయి. అయితే ఇంతవరకూ జగన్‌ గురించి ఒక్కసారంటే ఒక్కసారి కూడా మాట్లాడని వైఎస్ షర్మిల చెప్పుకొచ్చారు.

Related Posts