YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

డిసెంబర్ నాటికి 17వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి

డిసెంబర్ నాటికి 17వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి

తెలంగాణలో మిగులు విద్యుత్ సాధించే దిశగా విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణం చేయాలని ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్ కెపాసిటీ 15,344 మెగావాట్లు. వచ్చే రెండేళ్లలో 28,275 మెగావాట్ల విద్యుత్‌ను లక్ష్యంగా పెట్టుకోవాలని నిర్ణయించింది. ఈ ఏడాది చివరి నాటికి 17వేల మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసే అవకాశాలు ఉన్నాయి. కేటీపీఎస్ 7వ దశ 800 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వచ్చింది. ఈ ఏడాది చివరి నాటికి భద్రాద్రి విద్యుత్ ప్లాంట్ నుంచి 1080 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించనుంది. ఈ దిశగా ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని వేగవంతం చేశారు.  ప్రస్తుతం రాష్ట్రంలో కేటీపీఎస్ ఏ,బీ,సీ యూనిట్ల కింద 660 మెగావాట్లు, కేటీపీఎస్ ఐదో యూనిట్ నుంచి 500 మెగావాట్లు, కేటీపీఎస్ ఆరో యూనిట్ నుంచి 62.50 మెగావాట్లు, కాకతీయ టీపీపీ స్టేజి-1 నుంచి 600 మెగావాట్లు, కాకతీయ టీపీపీ స్టేజి-2 నుంచి 800 మెగావాట్లు, కేటీపీఎస్ ఏడో యూనిట్ నుంచి 800 మెగావాట్లతో కలుపుకుని మొత్తం 3622.50 మెగావాట్ల థర్మల్ విద్యుత్ లభ్యతలో ఉంది.జల విద్యుత్ 2985.67 ఎంయూ, సెంట్రల్ జనరేటింగ్ స్టేషన్స్ నుంచి 15790.58 ఎంయూ, ఏపీజపీసీఎల్ నుంచి 58.17 ఎంయూ విద్యుత్‌కు వస్తుందని డిస్కాం ప్రతిపాదించిన అంచనాలను లెక్కగట్టి కొనుగోలుకు మండలి ఆమోదం తెలిపింది. 24 గంటల వ్యవసాయ విద్యుత్, ఇతర కాలాల్లో విద్యుత్ కొరత తలెత్తితే డిమాండ్‌ను తట్టుకునే విధంగా సెప్టెంబర్ నెలలో 541.53 ఎంయూ, అక్టోబర్ నెలలో 186.40 ఎంయు, వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలలో 270.03 ఎంయూ, మార్చి నెలలో 160.63 ఎంయు విద్యుత్ కొనుగోలు చేయాలని డి స్కాంలు నిర్ణయించాయి. వీటికి మండలి ఆమో దం తెలిపింది.యాదాద్రి థర్మల్ ప్లాంట్ 4వేల మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తికి ప్రాజెక్టు నిర్మాణం పనులు చకాచకా సాగుతున్నాయి. ఈ ఏడాది 57631.27 ఎంయూ అవసరమని తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి గుర్తించి, ఈ మేరకు విద్యుత్ కొనుగోళ్లకు ఆమోదం తెలిపింది. సదరన్ డిస్కాంలో 34100.59 మిలియన్ యూనిట్లకు టీఎస్‌ఇఆర్‌సీ ఆమోదించింది. కాగా ఇందులో విద్యుత్ నష్టాల కింద 5446.55 ఎంయూ నష్టాల కింద పోతాయని అంచనా వేశారు. ఇందులో డిస్ట్రిబ్యూషన్ నష్టాలు 3631.96 ఎంయు, ట్రాన్స్‌మిషన్ వ్యవస్థ నష్టాలు 1814.59 ఎంయూ కింద లెక్కగట్టారు. మొత్తం నష్టాలు 13.77 శాతంగా నష్టాలు ఉంటాయి. ఇందులో ట్రాన్స్‌మిషన్ నష్టాల కింద 4.59 శాతం, డిస్ట్రిబ్యూషన్ నష్టాల కింద 10.81 శాతం నష్టాల కింద మండలి లెక్కించింది. నార్తరన్ డిస్కాంకు 15620.20 ఎంయూ విద్యుత్ అవసరమని మండలి ఆమోదించింది. ఇందులో విద్యుత్ నష్టాల కింద 2463.92 ఎంయూగా లెక్కగట్టారు. డిస్ట్రిబ్యూషన్ నష్టాల కింద 1657.76 ఎంయూ అంటే 11.77 శాతం, ట్రాన్స్‌మిషన్ సిస్టమ్ నష్టాల కింద 806.16 ఎంయు అంటే 11.77 శాతం నష్టాలుగా లెక్కగట్టారు.

Related Posts