YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం దేశీయం

 కన్వర్ యాత్రపై ఆలోచించండి

 కన్వర్ యాత్రపై ఆలోచించండి

 కన్వర్ యాత్రపై ఆలోచించండి
లక్నో, జూలై 16, 
దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. ఈ క్రమంలో థర్డ్ వేవ్ ప్రమాదం ముంచుకొస్తోంది. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్, ఉత్తర్‌ప్రదేశ్‌, హర్యానా రాష్ట్రాల్లో ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్న కన్వర్ యాత్రపై ఉత్కంఠ నెలకొంది. అయితే.. ఈ యాత్రను ఇప్పటికే రద్దు చేస్తున్నట్లు ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం ప్రకటించింది. హరిద్వార్‌కు భక్తులకు అనుమతి లేదని.. ఒకవేళ వస్తే క్వారంటైన్‌కు తరలిస్తామని తెలిపింది. ఇంకా దీనిపై యూపీ, పలు రాష్ట్రాలు స్పందించాల్సి ఉంది. దీనిపై సుప్రీంకోర్టు స్పందించింది. ఈ కన్వర్ యాత్రను రద్దు చేయాలని ఉత్తరప్రదేశ్‌తోపాటు పలు రాష్ట్రాలను ఆదేశాలిచ్చింది. భక్తులు హరిద్వార్ నుంచి గంగాజలాన్ని తీసుకురావడాన్ని అనుమతించొద్దంటూ ఆదేశాల్లో తెలిపింది. దీనిపై పునరాలోచించాలని.. లేకపోతే తామే నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది. నిర్దేశిత ప్రాంతాల్లో శివాభిషేకాలకు గంగా జలాన్ని ట్యాంకర్ల ద్వారా ఏర్పాటు చేయాలని సూచించింది. జీవించే హక్కు కంటే మత విశ్వాసాలు ముఖ్యం కాదంటూ ఈ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.ఇదిలా ఉంటే.. కన్వర్ యాత్రపై శుక్రవారం కేంద్రం.. సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. హరిద్వార్ నుంచి గంగాజలం తీసుకురావడానికి యాత్రికులకు అనుమతి ఇవ్వొద్దని రాష్ట్రాలకు సూచించినట్టు తెలిపింది. అయితే మత విశ్వాసాలను అనుసరించి ట్యాంకర్ల ద్వారా గంగాజలం అందుబాటులో ఉంచేలా ఏర్పాట్లు చేయాలని.. ఆయా రాష్ట్రాలకు సూచించినట్టు కేంద్రం తెలిపింది. దీనికోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొంది. గంగాజలం భక్తులకు అందుబాటులో ఉండేలా చూస్తున్నామని సుప్రీం కోర్టుకు తెలియజేసింది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ గంగాజలం పంపిణీ చేపట్టాలని.. ఆయా రాష్ట్రాలకు సూచించినట్టు కేంద్రప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెల్లడించింది. కాగా.. ఉత్తరాదిన శ్రావణ మాసంలో నిర్వహించే కన్వర్ యాత్రలో భాగంగా శివ భక్తులు గంగా నది నీటిని తీసుకొని వెళ్లి భగవంతుడికి జలాభిషేకం చేస్తారు.

Related Posts