YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు ఆంధ్ర ప్రదేశ్

కావలిలో 1000 కోట్ల కబ్జా

కావలిలో 1000 కోట్ల కబ్జా

నెల్లూరు, జూలై 17, 
అధికార పార్టీలోని ఎంఎల్‌ఎ షాడోలైన ప్రముఖ నాయకులు కొందరు అధికారులను తమ ఆధీనంతో పెట్టుకొని వ్యవసాయ భూములను సైతం అక్రమ లే అవుట్లుగా మార్చి, దాదాపు రూ.1000కోట్లు విలువైన భూములను అమ్ముకుంటూ.. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని 'జనసేన'పార్టీ సీనియర్‌ నాయకులు తోట వెంకటశేషయ్య ఆరోపించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కావలి పట్టణ ఉత్తర శివార్లలో ట్రంకు రోడ్డుకు-రైల్వే లైనుకు మధ్యన వైసిపి నాయకులు వేసిన లేఅవుట్లలో సర్వేనెంబర్‌ 656లో 4ఎకరాల పొనకావారిగుంట, 661లో 2ఎకరాల పంటకాలువ. 697లో 1.5ఎకరాల నీటిపారుదల శాఖకు చెందిన భూమి, 656-1, 2లలో 2ఎకరాలు అనాధీనం భూములను కబ్జా చేసినట్లు తెలిపారు. కావలి జెడ్‌పి గ్రౌండ్‌ తూర్పు హద్దు నుంచి, తుమ్మలపెంటరోడ్డు వెంబడి కొనదిన్నె వరకు ఉన్న మాగాణి భూమిని, నివాస భూమిగా మార్చి, అక్రమ లేఅవుట్లు వేశారని తెలిపారు. అందులో ఉన్న నీటి గుంతలను, వ్యవసాయ నీటిపారుదల కాలువలను, శ్మశానాలను, చెరువు కలుజు వాగులను కూడా కబ్జా చేశారని వివరించారు. ట్రంకురోడ్డు నుంచి తుమ్మలపెంట రోడ్డు, తాళ్లపాలెం చెరువు కలుజులో కలిసే సుమారు 50లింకులు వెడల్పుగల అడ్డకాలువను 10లింకులకు కుదించి వేశారని ఆరోపించారు. తుమ్మలపెంట రోడ్డులో సర్వే నెంబర్‌ 1263లో ఎ.2.63సెంటిమీటర్ల విస్తీర్ణం గల కుమ్మరిగుంటను గతంలో ప్రభుత్వం సర్వే చేసి, చుట్టూ ఫెన్సింగ్‌ వేయగా, ఎంఎల్‌ఎ షాడోలు కంచెను తొలగించి, 30సెంట్ల భూమిని ఉంచగా, ఆ 30సెంట్లగుంటలో కూడా మట్టితోలి, గుంటను పూడ్చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 9వ వార్డు రాజీవ్‌నగర్‌ పంటకాలువ నుంచి, బిట్‌-2సర్వేనెంబర్‌ 1150లో ఒంటేరు వెంకటరమణమ్మకు 1 ఎకరా భూమి ఉండగా ఆ భూమి పారుదల కాలువకు దక్షిణంవైపు ఆనుకుని ఉన్న భూమి యజమానులైన రామిరెడ్డి సందీప్‌కుమార్‌రెడ్డి, కేతిరెడ్డి బాలకృష్ణారెడ్డి, మునగాల మదన్‌మోహన్‌రెడ్డి సదరు భూమికి ఉన్న పారుదలకాలువ 27సెంట్లు భూమిని కబ్జా చేశారనే ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. ఇవేగాక, ట్రంకురోడ్డుకు మొదలుకుని, నేషనల్‌ హైవే వరకు అక్రమ లేఅవుట్లలోని పంటకాలువలు, డొంకలు, నీటిగుంటలు, శ్మశానాలు, నీటిపారుదల శాఖ వారి భూములు, అనాధీన భూములు వెరశి, రూ.1,000కోట్ల విలువైన భూములు కబ్జాదారులతో ప్రభుత్వ ఆదాయం లూటీ చేయబడిందని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం విచారణ అధికారులతో సర్వేచేయించి, కబ్జాదారుల లూటీని అదుపుచేయాలని పేర్కొన్నారు.

Related Posts