తిరుపతి
తిరుపతి ప్రభుత్వ ఆసుపత్రి వెనుక భాగంలో భూమిలో భారీగా మందులు పాతిపెట్టడం పై సిపిఐ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 50 లక్షల విలువైన మందులను వాహనాల్లో తరలించి కూచి పెట్టాల్సిన అవసరం ఏముందని సిపిఎం నేత మురళి ప్రశ్నించారు .ఈ రోజు మీడియా సమక్షంలో పాతి పెట్టిన చోట తిరిగి గొయ్యి తవ్వి మందులను బయటకు తీశారు. అందులో కాలం చెల్లిన మందులతోపాటు ఇంకా ఏడాదికిపైగా వ్యాలిడిటీ మందులు కూడా ఉన్నాయని తెలిపారు. ఈ ఘటనపై ఇప్పటికే జిల్లాకలెక్టర్, వైద్యాధికారి కి ఫిర్యాదు చేశామని తెలిపారు .దీనిపై విచారణ జరుపుతామన్నారని అన్నారు. మందుల గూర్చిన అంశంపై ప్రశ్నించినందుకు ఇద్దరు సిబ్బందిని సస్పెండ్ చేశారని అన్నారు. అసలే మందుల కొరత తో ప్రజలు అల్లాడుతుంటే 50 లక్షల విలువైన మందులను పూడ్చి పెట్టడం వెనుక రహస్యం పై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు