YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

వరంగల్ లో 46,729 మందికి పట్టాదార్ పాస్ పుస్తకాలు

వరంగల్ లో 46,729 మందికి పట్టాదార్ పాస్ పుస్తకాలు

అన్నదాతకు అండగా నిలిచేందుకు రైతు బంధు పధకానికి అంతా సిద్ధమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ మే 10వ తేదీన ముహూర్తం ఖరారు చేశా రు. మొదటి దశలో భాగంగా వరంగల్ అర్బన్ జిల్లాలో 124 రెవెన్యూ గ్రామాల ప రిధిలో మొత్తం 46,729 పట్టాదార్ పాస్ పుస్తకాలను పంపిణీ చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. వరంగల్ అర్బన్ జిల్లాలో మొదటి దశలో 69,109 పట్టాదార్ పాస్ పుస్తకాలు పంపిణీ చేయాల్సి ఉంది. కాగా ప్రస్తుతం జిల్లాకు 46,729 పట్టాదార్ పాస్ పుస్తకా లు చేరినట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. మిగిలినవి కూడా త్వరలోనే రానున్న ట్లు అధికారులు చెప్పారు. అంతేకాక ఒక రైతుకు ఒకే ఖాతా నంబర్‌ను కేటాయించారు. ఒకే ఖాతా నంబర్‌లోనే ఎన్ని సర్వే నంబర్లు ఉంటే అన్ని అదే ఖాతా బుక్‌లో నమోదు చేయనున్నట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. కాగా రెవెన్యూ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం జిల్లా వ్యాప్తంగా 3,33,922 సర్వే నంబర్లుండగా 1,31, 221 ఖాతా నంబర్లు ఉన్నాయి. వీటిలో 92,966 ఖాతా నంబర్లు క్లియర్‌గా ఉన్నట్లు రెవెన్యూ అధికారులు గుర్తించారు. అయితే వీటిలో 69,109 మందికి సంబంధించి తహసీల్దార్లు డిజిటల్ సైన్ పూర్తి చేశారు. వీటిలో మొదటి దశలో జిల్లాకు 46,729 పట్టాదార్ పాస్ పుస్తకాలు చేరాయి. వీటిని ఇప్పటికే ఆయా మండలాలకు పంపి పూర్తి స్థాయిలో పరిశీలించారు. 10వ తేదీ నుంచి పాస్ పుస్తకాలను పంపిణీ చేసేందుకు షెడ్యూల్ రూపొందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. షెడ్యూల్ ప్రకారం రెవె న్యూ అధికారులు గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి గ్రామస్తులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో పాస్ పుస్తకాలను అందజేయనున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే జిల్లాకు చేరిన పట్టాదార్ పాస్‌పుస్తకాలను ఆయా మండలాలకు పంపించి పరిశీలన కార్యక్ర మం కూడా పూర్తి చేసినట్లు తెలిపారు. అలాగే రైతుబంధు పథకం ద్వారా ఎకరాకు రూ. 4వేల చొప్పున పంట పెట్టుబడి అందించేందుకు ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకు సంబంధించి జిల్లాలో సుమారు 78 వేల మంది రైతులకు చెక్కుల ద్వారా రూ.69కోట్లు అందజేయనున్నారు. జిల్లాలో సుమారు 78 వేల మందికిగాను రూ.69 కోట్ల చెక్కులు అందజేయనున్నారు. చెక్కులతోపాటు భూప్రక్షాళన అనంతరం రైతుకు కొత్తగా డిజిటలైజ్డ్ పట్టాదార్ పాస్‌పుస్తకాలు అందిచేందుకు నిర్ణయించారు. ఈరెండు ఒకేరోజు ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందించారు. మే 10వ తేదీ నుంచి 17 వరకు చెక్కు లు, పాస్‌పుస్తకాలు పంపిణీ చేయనున్నారు.

Related Posts