YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

అప్రమత్తాయ నమః

అప్రమత్తాయ నమః

దేవతలంతా అమృతాన్ని సాధించిన ఆనందోత్సాహాలతో మునిగితేలుతున్న సమయంలో అక్కడికి అగస్త్యమహర్షి విచ్చేసారు. మహేంద్రుడు ఆయనను సాదరంగా ఆహ్వానించాడు.

' మహర్షి  మేము అమృతం త్రాగినందున  దానవులను జయించిన ఆనందంలో వున్నాము" అని చెప్పాడు.  "ఇంద్రా..ఏ అమృతం తో మీ దేవతలు విజయం పొందారు ? అని  అడిగారు మహర్షి.  " పాలకడలి చిలకగా వచ్చిన అమృతం సేవించగా వచ్చిన శక్తితో దానవులను జయించాము.''అని బదులు యిచ్చాడు ఇంద్రుడు. "పాలకడలిని మీ శక్తితోనా మధించారు. లేదే.  పాలకడలిని చిలికి అమృతాన్ని సాధించడంలో అడుగడుగున మీకు తోడ్పడింది మహావిష్ణువు.   ఆ నారయణుని దయతోనే   మీరు అమృతం పొందారు. దానవులను జయించారు." ఇంద్రుడు ఆలోచనలో పడ్డాడు. మరల,అగస్త్య మహర్షి ఇలా అన్నారు " ఇంద్రా..మీరు దుర్వాస మహర్షి శాపం వలన మీ సర్వశక్తులను కోల్పోయారు. మీ దేవతలకు స్వర్గాధిపత్యం రావాలంటే దానవులను నిర్జించగల మహాశక్తి కావాలి. అది అమృతంతోనే సాధ్యం.  అది పొందాలంటే పాలకడలిని  చిలకాలనే ఆలోచన చెప్పినది నారాయణుడు.  మీ దేవతలు మాత్రమే ఆ పని చేయలేరని  దానవులు సహాయం తీసుకోమని  చెప్పినదీ నారాయణుడే. మంధరపర్వతాన్ని గరుడవాహనం మీద తీసుకుని వచ్చి పాలకడలి మధ్య నిలిపినది నారాయణుడు. ఆ మంధర కవ్వం మునిగిపోతుంటే  కూర్మ రూపం దాల్చి మీరు పాలకడలిని చిలకడానికి సహాయపడినది ఆ నారాయణుడు. దేవతలు ,దానవులు చిలకడానికి అలసి పోయినప్పుడు, మీలో వుండి శక్తిని యిచ్చి సహాయపడినది మహావిష్ణువు.  పాలకడలి నుండి వెలువడిన విషాన్ని పరమశివునికిచ్చి లోకాన్ని కాపాడమని చెప్పినది నారాయణుడు. ధన్వంతరి రూపంలో అమృత కలశం తెచ్చినది నారాయణుడు. దుష్ట దానవులకు అమృతంలో భాగం లభిస్తే వారి అరాచకాలు మితిమీరిపోతాయని మోహినీ రూపం దాల్చి అసురులను వ్యామోహంలో ముంచి అమృతాన్ని మీకు మాత్రమే పంచినది మహావిష్ణువు.  మీరు విజయం సాధించి అనుగ్రహం పొందడానికి శ్రీ మహాలక్ష్మి ని తన వక్షస్ధలాన ధరించినది మహావిష్ణువు.  ఈ విధంగా మహావిష్ణువు మిమ్మల్ని కాపాడడానికి ఎన్నో జాగ్రత్తలు తీసుకుని మీ దేవతలను రక్షించాడు.  ఇందుకు మహావిష్ణువు చేసిన ఆలోచన, రాజతంత్రం, మంధర పర్వతాన్ని తీసుకుని రావడం, దానిని కవ్వంగా ఉపయోగించమని తానే మొయ్యడం క్షీరజలధి లో నుండి వెలువడిన విషప్రభావానికి లోకాలు దగ్ధం కాకుండా విరుగుడు ఆలోచన చేయడం, అమృతం తీసుకుని రావడం,   యీ విధంగా అన్ని సమయాలలో మీ కంటె ఎక్కవగా నారాయణుడే సమయస్ఫూర్తితో అతి జాగురూకత తో అన్ని విషయాలు  గమనించి దేవతలకు విజయాన్ని కట్టబెట్టాడు. ఆ మహావిష్ణువు లక్ష్మీ దేవితో చేరి  మిమ్మల్ని అనుగ్రహించినందు వలన మీరు విజయం సాధించారు."   మరి మీరు ప్రతిఫలంగా ఏం చేస్తారో " అని నవ్వుతూ  వెళ్ళి పోయారు అగస్త్య మహర్షి. " అమృతం తాగిన సంతోషంలో, విజయం సాధించిన గర్వంతోను, తమని అప్రమత్తతో కాపాడిన నారాయణునికి ముందుగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి "  అని తలచి కుంభకోణంలోని సారంగపాణి ఆలయ గర్భగుడిలో మహావిష్ణువు ధ్యాన శ్లోకం  పఠిస్తూ ఆ ముక్కోటి దేవతలు మహావిష్ణువుని భక్తి శ్రధ్ధలతో పూజించి తమకి అమృతాన్ని యిచ్చిన ఆరవముదునికి (సారంగపాణి ఆలయంలోని విష్ణువు ను ఆరవముదం అని పిలుస్తారు) కృతజ్ఞతలు తెలిపారు. ఈవిధంగా దేవతలను కాపాడినప్పడు  ఒక్కొక్క సమయంలో కూర్మమూర్తిగా మహావిష్ణువు తీసుకున్న  జాగ్రత్తలు ఈ వృత్తాంతం ద్వారా తెలుస్తుంది.  ' ప్రమత్తః' అంటే సమయోచిత దృష్టి లేని వారు. 

' అప్రమత్తః' అంటే జాగురూకతతో వ్యవహరించేవారు.  అతి జాగ్రత్తగా తనను నమ్మినవారిని  కాపాడినందున కూర్మ మూర్తికి " అప్రమత్తః" అని పేరు వచ్చింది.  సహస్రనామాలలో యిది 327 వ నామము. అప్రమత్తాయనమః "అని నిత్యం జపించే భక్తులను అతి జాగ్రత్తగా కాపాడి, నారాయణడు వారు విజయాలు సాధించేలా అనుగ్రహిస్తున్నాడు. దేవతలంతా అమృతాన్ని సాధించిన ఆనందోత్సాహాలతో మునిగితేలుతున్న సమయంలో అక్కడికి అగస్త్యమహర్షి విచ్చేసారు. మహేంద్రుడు ఆయనను సాదరంగా ఆహ్వానించాడు. ' మహర్షి  మేము అమృతం త్రాగినందున  దానవులను జయించిన ఆనందంలో వున్నాము" అని చెప్పాడు.  "ఇంద్రా..ఏ అమృతం తో మీ దేవతలు విజయం పొందారు ? అని  అడిగారు మహర్షి.  " పాలకడలి చిలకగా వచ్చిన అమృతం సేవించగా వచ్చిన శక్తితో దానవులను జయించాము.''అని బదులు యిచ్చాడు ఇంద్రుడు. "పాలకడలిని మీ శక్తితోనా మధించారు. లేదే.  పాలకడలిని చిలికి అమృతాన్ని సాధించడంలో అడుగడుగున మీకు తోడ్పడింది మహావిష్ణువు.   ఆ నారయణుని దయతోనే   మీరు అమృతం పొందారు. దానవులను జయించారు." ఇంద్రుడు ఆలోచనలో పడ్డాడు. మరల,అగస్త్య మహర్షి ఇలా అన్నారు " ఇంద్రా..మీరు దుర్వాస మహర్షి శాపం వలన మీ సర్వశక్తులను కోల్పోయారు. మీ దేవతలకు స్వర్గాధిపత్యం రావాలంటే దానవులను నిర్జించగల మహాశక్తి కావాలి. అది అమృతంతోనే సాధ్యం.  అది పొందాలంటే పాలకడలిని  చిలకాలనే ఆలోచన చెప్పినది నారాయణుడు.  మీ దేవతలు మాత్రమే ఆ పని చేయలేరని  దానవులు సహాయం తీసుకోమని  చెప్పినదీ నారాయణుడే. మంధరపర్వతాన్ని గరుడవాహనం మీద తీసుకుని వచ్చి పాలకడలి మధ్య నిలిపినది నారాయణుడు. ఆ మంధర కవ్వం మునిగిపోతుంటే  కూర్మ రూపం దాల్చి మీరు పాలకడలిని చిలకడానికి సహాయపడినది ఆ నారాయణుడు. దేవతలు ,దానవులు చిలకడానికి అలసి పోయినప్పుడు, మీలో వుండి శక్తిని యిచ్చి సహాయపడినది మహావిష్ణువు.  పాలకడలి నుండి వెలువడిన విషాన్ని పరమశివునికిచ్చి లోకాన్ని కాపాడమని చెప్పినది నారాయణుడు. ధన్వంతరి రూపంలో అమృత కలశం తెచ్చినది నారాయణుడు. దుష్ట దానవులకు అమృతంలో భాగం లభిస్తే వారి అరాచకాలు మితిమీరిపోతాయని మోహినీ రూపం దాల్చి అసురులను వ్యామోహంలో ముంచి అమృతాన్ని మీకు మాత్రమే పంచినది  మహావిష్ణువు.  మీరు విజయం సాధించి అనుగ్రహం పొందడానికి శ్రీ మహాలక్ష్మి ని తన వక్షస్ధలాన ధరించినది మహావిష్ణువు.  ఈ విధంగా మహావిష్ణువు మిమ్మల్ని కాపాడడానికి ఎన్నో జాగ్రత్తలు తీసుకుని మీ దేవతలను రక్షించాడు. ఇందుకు మహావిష్ణువు చేసిన ఆలోచన, రాజతంత్రం, మంధర పర్వతాన్ని తీసుకుని రావడం, దానిని కవ్వంగా ఉపయోగించమని తానే మొయ్యడం క్షీరజలధి లో నుండి వెలువడిన విషప్రభావానికి లోకాలు దగ్ధం కాకుండా విరుగుడు ఆలోచన చేయడం, అమృతం తీసుకుని రావడం,   యీ విధంగా అన్ని సమయాలలో మీ కంటె ఎక్కవగా నారాయణుడే సమయస్ఫూర్తితో అతి జాగురూకత తో అన్ని విషయాలు  గమనించి దేవతలకు విజయాన్ని కట్టబెట్టాడు.  ఆ మహావిష్ణువు లక్ష్మీ దేవితో చేరి  మిమ్మల్ని  అనుగ్రహించినందు వలన మీరు విజయం సాధించారు."   మరి మీరు ప్రతిఫలంగా ఏం చేస్తారో " అని నవ్వుతూ  వెళ్ళి పోయారు అగస్త్య మహర్షి. " అమృతం తాగిన సంతోషంలో, విజయం సాధించిన గర్వంతోను, తమని అప్రమత్తతో కాపాడిన నారాయణునికి ముందుగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి "  అని తలచి కుంభకోణంలోని సారంగపాణి ఆలయ గర్భగుడిలో మహావిష్ణువు ధ్యాన శ్లోకం  పఠిస్తూ ఆ ముక్కోటి దేవతలు మహావిష్ణువుని భక్తి శ్రధ్ధలతో పూజించి తమకి అమృతాన్ని యిచ్చిన ఆరవముదునికి (సారంగపాణి ఆలయంలోని విష్ణువు ను ఆరవముదం అని పిలుస్తారు) కృతజ్ఞతలు తెలిపారు. ఈవిధంగా దేవతలను కాపాడినప్పడు  ఒక్కొక్క సమయంలో కూర్మమూర్తిగా మహావిష్ణువు తీసుకున్న  జాగ్రత్తలు ఈ వృత్తాంతం ద్వారా తెలుస్తుంది.  ' ప్రమత్తః' అంటే సమయోచిత దృష్టి లేని వారు.

' అప్రమత్తః' అంటే జాగురూకతతో వ్యవహరించేవారు.  అతి జాగ్రత్తగా తనను నమ్మినవారిని  కాపాడినందున కూర్మ మూర్తికి " అప్రమత్తః" అని పేరు వచ్చింది.  సహస్రనామాలలో యిది 327 వ నామము.  అప్రమత్తాయనమః "అని నిత్యం జపించే భక్తులను అతి జాగ్రత్తగా కాపాడి, నారాయణడు వారు విజయాలు సాధించేలా అనుగ్రహిస్తున్నాడు. 

వరకాల మురళీమోహన్ గారి సౌజన్యంతో 

Related Posts