హైదరాబాద్
ఒక ప్రముఖ గాయనిని వేధిస్తున్న వ్యక్తిని పోలీసులు ఆరెస్టు చేసారు. నిందితుడు గాయని పేరుతో సోషల్ మీడియాలో అకౌంట్ ఓపెన్ చేసాడు. గాయని పై యూట్యూబ్ ఛానల్ లో అశ్లీల కంటెంట్ అప్లోడ్ చేసాడు. ఫెస్ బుక్, ఇన్ స్టాగ్రాం లో సైతం గాయని పేరుతో ఖాతా తెరిచాడు. గాయని ఫోటోతో ఫిల్మ్ ప్రొడక్షన్ మొదలుపెట్టాడు. ఈ విషయం తెలిసిన సింగర్ కుటుంబం షాక్ కు గురయ్యారు. నిందితుడికి ఫోన్ చేసి సోషల్ ఖాతాలు తొలగించాలని సింగర్ కోరింది. తాను చేసే పనులకు ఎన్ ఓ సి ఇవ్వాలని సింగర్ కు వేదింపులుగురి చేసాడు. వేదింపులు ఎక్కువ కావడంతో పోలీసులకు ఫిర్యాదు చేసారు. సింగర్ ఫిర్యాదు తో నిందితుడు మేడికాయల నవీన్ కుమార్ అరెస్ట్ చేసారు. నిందితుడు నవీన్ గ్రామం బలగాన్ హళ్లి, కర్ణాటక . రాచకోండ పోలీసులు నవీన్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.