ఆ ఇద్దర్నీ సస్పేండ్_
అక్కడ ఆయన..ఇక్కడ ఈమె..సస్పెన్షన్
◆ _మధ్యాహ్నం
సీఐ మల్లికార్జున్ రెడ్డి సస్పెండ్_
◆ కొద్దిసేపటికే... ఏఎస్‌పీ ఎసీబీ సునితా రెడ్డి
నగరానికి చెందిన సీఐ కల్వకుర్తి మల్లికార్జున్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. ఐజీ స్టీఫెన్ రవీంద్ర ఐపీఎస్ ఆయనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఏఎస్‌పీ ఎసీబీ సునితా రెడ్డి వాంగ్మూలాన్ని కేపీహెచ్‌బీ పోలీసులు రికార్డు చేశారు. అక్రమ సంబంధం అభియోగాలపై సీఐ మల్లికార్జున రెడ్డిని సస్పెండ్ చేసినట్లు సమాచారం. ఆయనపై కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయింది.తన వివాదాస్పద వ్యవహార సరళితో పోలీస్ శాఖ పరువు తీసిందనే ఆరోపణలపై ఏసీబీ అడిషనల్ ఎస్పీ సునీతా రెడ్డిని, సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ అయ్యాయి.
వివాహేతర సంబంధం వివాదంలో ఇరుక్కున్న ఏసీబీ ఏఎస్పీపై సస్పెన్షన్ వేటు పడింది. వివాదాస్పద వ్యవహారశైలితో పోలీస్ శాఖ పరువు తీశారంటూ మహిళా అధికారిని సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సీఐ మల్లికార్జున్ రెడ్డి ఇప్పటికే సస్పెండ్ అయిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి అంతర్గత విచారణ చేపట్టిన పోలీసులు మంగళవారం ఏఎస్పీ భర్త సురేందర్ రెడ్డితో పాటు మరో ముగ్గురి స్టేట్‌మెంట్ రికార్డు చేశారు. ఏఎస్పీ, సీఐల మధ్య ఫోన్ కాల్స్ సంభాషణలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. అలాగే ఏఎస్పీ నివాసం ఉంటున్న అపార్ట్‌మెంట్‌లోని సీసీ కెమెరా ఫుటేజ్‌ను స్వాధీనం చేసుకున్నారు.
సీఐ వివాహేతర బంధం:
ఏఎస్పీ స్టేట్‌మెంట్ రికార్డ్
భర్త సంచలన వ్యాఖ్యలు
ఏసీబీ ఏఎస్పీపై భర్త సురేందర్ రెడ్డి మంగళవారం సంచలన ఆరోపణలు చేశారు. తన భార్యతో సీఐకి 2016 నుంచి సంబంధం ఉందని చెప్పారు. పెద్దల సమక్షంలో రాజీకి వచ్చినా తన భార్య తనను మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. తన భార్యను క్షమించడమే తాను చేసిన నేరం అన్నారు.
ఇద్దరిపై కఠిన చర్యలు తీసుకోవాలని సురేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. అంతకుముందు తమ మధ్య గొడవ ఉన్నప్పటికీ తాము రాజీకి వచ్చామని, కానీ తన భార్య తనను మళ్లీ మోసం చేసిందని వాపోయారు. మరోవైపు, ఏసీబీ ఏఎస్పీ, సీఐ కేసులో పోలీసులు విచారణను ముమ్మరం చేశారు.
నలుగురి స్టేట్‌మెంట్ రికార్డ్
ఈ కేసుకు సంబంధించి నలుగురి స్టేట్‌మెంటును రికార్డ్ చేశారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. అలాగే నెల హూహూ వారిద్దరు మాట్లాడుకున్నారా, ఎన్నిసార్లు మాట్లాడుకున్నారని తెలుసుకునేందుకు వారిద్దరి ఫోన్ కాల్ డేటాను కూడా పరిశీలించారు. సీసీటీవీ ఫుటేజీలో ఇద్దరు కెమెరాకు చిక్కిన విషయం తెలిసిందే.
డీజీపీకి నివేదిక!
రాసలీలల వ్యవహారంపై ఏసీబీ ఎస్పీ ఇంటికి కేపీహెచ్‌బీ పోలీసులు మంగళవారం వెళ్లారు. ఆమె స్టేట్‌మెంటును రికార్డ్ చేశారు. ఆ తర్వాత సీఐని ప్రశ్నించారు. దీనిపై ఐజీ స్టీఫెన్ రవీంద్ర.. డీజీపీకి నివేదిక ఇవ్వచ్చారు.