కామారెడ్డి
అతడు ఇంటర్మీడియట్ కూడా పాస్ కాలేదు... కానీ ఏకంగా డీఎస్పీ యూనిఫామ్, పోలీసు శాఖ గుర్తింపు పొందిన ఐడి కార్డులు సృష్టించి తన కారుపై వెళ్లి దర్జాగా డీఎస్పీగా చలామణి అయి, పలువురికి ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ , నకిలీ పాస్ బుక్కులు, సెటిల్మెంట్లు చేస్తున్న వ్యక్తిని బేగం బజార్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కామారెడ్డి జిల్లా బిబి పేట మండలం తుజల్ పూర్ గ్రామానికి చెందిన ఓ నకిలీ డి.ఎస్.పి పోలీసులు బాగోతం బట్టబయలైంది. బేబీ పేట మండలం తుజల్ పూర్ గ్రామానికి చెందిన నెల్లూరు స్వామి డీఎస్పీ వేషధారణలో ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిరుద్యోగులకు టార్గెట్ చేసుకొని లక్షల్లో వసూళ్లకు పాల్ప డ్డారు.. కామారెడ్డి జిల్లాలోని పలువురు నిరుద్యోగులకు మాయమాటలు చెప్పి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో అంతా మన వల్లే ఉన్నారంటూ ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని గాలం వేశాడు. ఒక్కొక్కరి నుండి లక్షల్లో వసూలు చేశాడు. ఇలా స్వామి తన గ్రామంలో కొందరితో కలిసి ముఠా గా ఏర్పడి కరీంనగర్, సిరిసిల్ల, సిద్దిపేట, నిజామాబాద్ ,మెదక్ జిల్లాలోనూ 20 మంది నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాల పేరిట నమ్మబలికాడు. ఒక్కొక్కరి నుండి 5 లక్షల నుంచి 10 లక్షల వరకు వసూలు చేసినట్లు తెలిసింది. అర్ధరాత్రి అయ్యిందంటే చాలు నెల్లూరు స్వామి పది మంది తో కలిసి బీబీపేట , తుజల్ పూర్ బస్టాండ్ల వద్ద వాహనాన్ని నిలుపుకొని పోలీసుల విధులు నిర్వహిస్తూ మరి వాసుల్లకు పాల్పడేవాడని ఆరోపణలు.. తుజల్ పూర్ గ్రామంలో ఉండే కూడేల్లి వాగు నుంచి వెళ్లే ఇసుక ట్రాక్టర్ల ను, టిప్పర్లు టార్గెట్ చేసుకొని స్వామి డిఎస్పి వసూళ్లకు పాల్పడేవాడు. నకిలీ పాస్ బుక్కులు తయారు చేయించి ఇవ్వడం, గ్రామానికి చెందిన కొందరు హౌసింగ్ లోన్స్, పాసుబుక్ లపై లోన్లు ఇప్పించడం వంటి పనులు చేసేవాడు.. విషయం తెలిసిన పోలీసులు సైతం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.. స్వామికి స్థానికంగా ఉండే ఓ అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి, భార్య అక్క కొడుకు లు అండ ఉండడం వల్ల పలు మోసాలకు అక్రమాలకు పాల్పడటం జరిగిందని స్థానికులు పేర్కొంటున్నారు... సుమారు ఒక సంవత్సరం పాటు ఇతని పోలీసు పని సజావుగా సాగింది. స్వామి పై అనుమానం వచ్చిన కొందరు పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు ఫిర్యాదు చేయడంతో, బేగం బజార్ పోలీస్ స్టేషన్ లో బాధితులు ఫిర్యాదు చేశారు. విచారణలో అతను పోలిస్ కాదని తేలింది.. దీంతో నకిలీ పోలీస్ నెల్లూరు స్వామిని పట్టుకునేందుకు హైదరాబాద్లోని బేగం బజార్ నుండి పోలీసులు స్పెషల్ పార్టీ పోలీసులు మూడు రోజులుగా బిబీ పేట మండలంలో మకాం వేశారు. కామారెడ్డి పోలీసుల సహకారంతో ఈ నెల 14 బుధవారం రాత్రి స్వామిని అతని ఇంటి వద్దనే అదుపులోకి తీసుకున్నారు. టర్మీడియేట్ పాస్ కానీ వ్యక్తి డీఎస్పీగా ఇన్నిరోజులు చలామణి అవుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని , స్థానిక పోలీసులు కూడా అతనితో పార్టీలకు వెళ్లడం తో పలు అనుమానాలకు దారితీస్తుంది.