YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు ఆరోగ్యం దేశీయం విదేశీయం

ఒలింపిక్స్ లో కరోనా

ఒలింపిక్స్ లో కరోనా

టోక్యో, జూలై 18,
టోక్యో ఒలింపిక్స్ ప్రారంభానికి ఇంకా వారం రోజులే స‌మ‌యం ఉంది. మ‌రోవైపు క‌రోనా వైర‌స్ భ‌యాందోళ‌న‌లు కూడా ఉన్నాయి. అయితే ఇవాళ టోక్యోలో ఉన్న ఒలింపిక్ విలేజ్‌లో తొలి క‌రోనా కేసు న‌మోదు అయ్యింది. వేలాది మంది అథ్లెట్లు పాల్గొన్న మ‌హాక్రీడ‌ల్లో మ‌హ‌మ్మారి ఎలా విజృంభిస్తుందో అన్న భ‌యం కూడా ఉంది. విలేజ్‌లో స్క్రీనింగ్ టెస్ట్ నిర్వ‌హిస్తున్న స‌మ‌యంలో.. తొలి కేసు బ‌య‌ట‌ప‌డిన‌ట్లు టోక్యో నిర్వాహ‌క క‌మిటీ ప్ర‌తినిధి మాసా ట‌కాయా తెలిపారు. గేమ్స్ నిర్వ‌హ‌ణ కోసం విదేశాల నుంచి వ‌చ్చిన ఓ విజిట‌ర్‌కు వైర‌స్ సంక్ర‌మించిన‌ట్లు టోక్యో 2020 సీఈవో తోషిరో ముటో తెలిపారు. ఆ వ్య‌క్తి ఏ దేశానికి చెందిన‌వారో తెలియ‌జేయ‌లేదు.ఇటీవ‌ల ఓ అథ్లెట్‌తో పాటు కొంద‌రు ఒలింపిక్ సిబ్బందికి క‌రోనా వైర‌స్ సంక్ర‌మించింది. జూలై 13, 14వ తేదీల్లో ఆరుగురికి క‌రోనా సోకిన‌ట్లు టోక్యో ఒలింపిక్స్ త‌న వెబ్‌సైట్‌లో పేర్కొన్న‌ది. జూలై 23 నుంచి ఆగ‌స్టు 8వ తేదీ వ‌ర‌కు జ‌రిగే క్రీడ‌ల్లో.. ఒలింపిక్స్ విలేజ్‌లో సుమారు 11 వేల మంది అథ్లెట్లు బ‌స చేయ‌నున్నారు. బ్రెజిల్ ఒలింపిక్ బృందం ఉంటున్న హోట‌ల్‌లోనూ భారీ సంఖ్య‌లో ఇటీవ‌ల పాజిటివ్ కేసులు న‌మోదు అయిన విష‌యం తెలిసిందే.

Related Posts